టాలీవుడ్ సీనియర్ నటి రాధా కూతురు, హీరోయిన్ కార్తిక వివాహం నవంబర్ 19, ఆదివారం రోజున రోహిత్ మేనన్ అనే వ్యక్తితో అంగరంగ వైభవంగా జరిగింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సాంప్రదాయంలో కార్తీక, రోహిత్ వివాహం జరిగింది. వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. వీరిది ప్రేమ వివాహం. కొద్దిరోజుల క్రితమే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ ని చేసుకున్నారు.
ఆ విషయాన్ని కార్తిక తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. వివాహ సమయంలో కార్తిక కేరళ సాంప్రదాయం ప్రకారం దుస్తులను ధరించి, బంగారు నగలతో నిండిపోయింది. రోహిత్ కూడా కేరళ సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను ధరించారు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి ప్రముఖ సెలబ్రిటీల అందరూ తరలివచ్చారు. ఇక చాలా రోజులు తర్వాత వీరందరూ కలవడంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Advertisement
కార్తీక టాలీవుడ్ ఇండస్ట్రీకి నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనంతరం కార్తిక కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోయింది. ఆ తర్వాత రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దమ్ము వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక కార్తిక తమిళంలో పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. అంతేకాకుండా కార్తీక వ్యాపార రంగంలో కూడా చక్కగా రాణిస్తోంది. ఇక కార్తీక వివాహ అనంతరం సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!