వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో పెళ్లి చేసుకున్నారు వీళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. కొంతకాలంగా వీళ్ళు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ కూడా జరిపారు రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు. రిసెప్షన్ తర్వాత ఈ కొత్త దంపతులు హైదరాబాద్లోనే దీపావళి వేడుకలను కూడా జరుపుకున్నారు.
Advertisement
తర్వాత వరుణ్ తేజ్ తన అత్తారింటికి వెళ్లారు లావణ్య త్రిపాటి అయోధ్యలో పుట్టినప్పటికీ ప్రస్తుతం తన తల్లిదండ్రులు డెహ్రాడూన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిహారిక, వరుణ్ తల్లిదండ్రులతో పాటుగా వరుణ్ తేజ్ లావణ్య కూడా ఆ డెహ్రాడూన్ వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరూ ఇంకోసారి ఘనంగా రిసెప్షన్ చేసుకున్నారు. డెహ్రాడూన్ లో ఇంకొకసారి రిసెప్షన్ వేడుకని చేసుకున్నారు.
Advertisement
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రిసెప్షన్ వేడుకల్లో భాగంగా వరుణ్ తేజ్ వైట్ కలర్ కుర్తా వేసుకున్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం ట్రెండీ పేర్లో అందంగా కనపడ్డారు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ షికార్లు కొడుతున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి తన షూటింగ్ పనుల్లో బిజీగా ఉండబోతున్నారు వరుణ్ లావణ్య కూడా సినిమాల్లో నటించబోతున్నారని వార్తలు అయితే వినపడుతున్నాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!