చాణక్య ఎన్నో విషయాలు గురించి, ఎంతో చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మనం అద్భుతంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఆచార్య చాణక్య తల్లిదండ్రులు ఎటువంటి పనులు చేస్తే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాన్ని చెప్పారు. మరి తల్లిదండ్రులు ఎటువంటి పనులు చేస్తే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి మంచి అలవాట్లను నేర్పించాలి.
Advertisement
పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటారు మంచి మర్యాదగల పిల్లలు ఎప్పుడూ కూడా మంచి లక్షణాలతో ఉంటారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. విద్య జీవితంలో చీకటిని తొలగిస్తుంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ చదువు విషయంలో ప్రోత్సహించాలి. అలానే తల్లిదండ్రులు పిల్లలకి మొదటి నుండి కూడా మంచి చెడులు గురించి అవగాహనని ఇవ్వాలి.
Advertisement
పిల్లలు కూడా నిజం మాట్లాడేలా ప్రోత్సహించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసి వాళ్లకి మంచి నేర్పాలి తప్పు చేసినట్లయితే తప్పని తెలియజేయాలి. క్రమశిక్షణని తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలకి నేర్పాలి. క్రమశిక్షణ ఉంటే అన్ని పనులు సరిగ్గా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఇటువంటి అలవాట్లు కనుక తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించినట్లైతే వాళ్ళ జీవితం బాగుంటుంది. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పిల్లలు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!