సింగర్ సునీత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత అందరికీ సుపరిచితమే. ఆమె మాటలతో పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. సునీతకి అభిమానులు ఎక్కువగానే ఏర్పడ్డారు. అయితే రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలా విమర్శల్ని ఈమె ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్లికి వచ్చిన పిల్లలు ఉండగా ఇదేం పని అని చాలామంది బాధపెట్టారు. ఆ టైంలో సినీ ప్రముఖులు మాత్రం ఆమెకి సపోర్ట్ గా ఉన్నారు. ఆ తర్వాత సునీత రెండవ పెళ్లి గురించి అంతా మర్చిపోయారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత సునీత బుల్లితెరపై కూడా షోలలో జడ్జిగా మెంటర్ గా వ్యవహరించారు. ఆమె పిల్లల భవిష్యత్తును కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత లైఫ్ గురించి తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు. నా 28 ఏళ్ల కెరియర్ లో ఎన్నో షోలు చేసాను. మొదట్లో నా గొంతు హస్కీగా ఉందని కొన్ని మాటలను గొంతులోనే ఆపేస్తుందని ఇలా విమర్శలను ఎదుర్కొన్నాను. అయితే నేను స్టూడియో ని దేవాలయంలో భావించే దాన్ని అని చెప్పుకొచ్చారు.
నేను చాలా సెన్సిటివ్. ప్రతి దానికి ఏడ్చేసేదాన్ని. రెండవ పెళ్లి చేసుకోవడం అనేది నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం గా నేను భావిస్తున్నాను అని సునీత చెప్పుకొచ్చారు. 17 ఏళ్లకు నేను సినిమాల్లోకి వచ్చాను. 35 ఏళ్లు వచ్చేదాకా కష్టపడ్డాను. కొంతమంది నన్ను మోసం చేశారు అన్ని తట్టుకుని నిలబడగలిగాను అని సునీత చెప్పారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!