చిరంజీవి కూతురు శ్రీజ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈమధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా తన భర్తతో విడిపోయారు. కానీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుండె బద్దలైనప్పుడు అదొక్కటే మార్గం అని ఎమోషనల్ అయింది. ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా హాజరయ్యారు. చిరు చిన్న కూతురు శ్రీజ కూడా పెళ్లికి వెళ్లారు. లావణ్య వరుణ్ తేజ్ లతో పాటుగా ఫోటోలు కూడా దిగారు.
Advertisement
ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే శ్రీజ తాజాగా చేసిన పోస్ట్ చూస్తే గుండె ముక్కలైపోయినప్పుడు అదొక్కటే మార్గం అని ఆమె పోస్ట్ చేసింది. విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు హృదయం గాయపడుతుంది. విరిగిపోతుంది. మనసు కలత చెందుతుంది. క్షీణిస్తుంది. శరీర అలిసిపోతుంది. బలహీనంగా ఉంటుంది.
Advertisement
అలాంటి టైం లో కళ్ళు మూసుకుని నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి మళ్లీ కనెక్ట్ అవ్వండి. ఇది ఒకటే మార్గం అని ఆమె రాసుకు రావడం జరిగింది. ఈ పోస్ట్ కి చాలా మంది నెటిజెన్స్ స్పందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ కి 2016లో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ విడిపోయారంటూ కొన్నాళ్లగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాలపై ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదు. వరుణ్ తేజ్ పెళ్లికి కళ్యాణ్ రాక పోవడంతో వీళ్ళిద్దరూ విడిపోయారని క్లారిటీ అయితే వచ్చేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!