మహమ్మద్ షమీ బౌలింగ్ తో ప్రతి ఒక్క టీమిండియా అభిమాని పండగ చేసుకుంటున్నారు. ఎలాంటి టైం లో కం బ్యాక్ ఇచ్చాడో తెలియదు కానీ ఎదురులేకుండా చెలరేగిపోతున్నాడు. పిచ్ కండిషన్స్ తో సంబంధం లేకుండా తనకు ఉన్న సీనియారిటీని, టాలెంట్ ను పూర్తిగా వినియోగించుకుంటూ వికెట్ల వేట సాగిస్తున్నాడు ఈ వరల్డ్ కప్ లో. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ చూస్తే పిచ్ స్లో అయ్యి బ్యాటింగ్ కు అనుకూలిస్తు మిగిలిన భారత బౌలర్లంతా కివీస్ బ్యాటర్లను అవుట్ చేయలేక చేతులు ఎత్తేసిన చోట ఒక్కడే నిలబడి 7 వికెట్లు తీశాడు షమీ.
Advertisement
398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటంతో 327 పరుగులు చేసిన షమీని మాత్రం ఎదుర్కోలేకపోయింది. మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చిన చోట 57 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీశాడు మహమ్మద్ షమీ. న్యూజిలాండ్ టాప్ ఫైవ్ బ్యాటర్లను షమీనే అవుట్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి మ్యాచ్ శమీ వర్సెస్ న్యూజిలాండ్ అని. జరిగింది సెమీ ఫైనల్ కాదు షమీ ఫైనల్ అని. మ్యాచ్ లో ఓ కీలకమైన క్యాచ్ ను డ్రాప్ చేశాడు. కానీ అది అందరూ మర్చిపోయేలా కసితో, తన టాలెంట్ తో షమీ అదరగొట్టాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ సెకండ్ స్పెల్ లో నిప్పులు చెరిగి రెండు వికెట్లు తీశాడు. ఇక తన చివరి స్పెల్ లో అయితే మ్యాచ్ మొత్తాన్ని భారత్ చేతిలోకి తీసుకువచ్చాడు. ఈ స్పెల్ లో మూడు వికెట్లు సాధించాడు మహమ్మద్ షమీ.
ఈ మ్యాచ్ ద్వారా ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ఓ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇప్పటివరకు నెహ్ర పేరు మీద ఉన్న రికార్డును 2003 వరల్డ్ కప్ నాటి ఆరు వికెట్ల రికార్డును బద్దలు కొట్టి ఏడు వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ద్వారా ఓ వరల్డ్ కప్ లో మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. మొత్తంగా వరల్డ్ కప్ లో షమీకి ఇది నాలుగో, ఐదు వికెట్ల ప్రదర్శన. ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ కూడా షమీనే.
Advertisement
కేవలం 17 వరల్డ్ కప్ మ్యాచ్లోనే షమీ ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు భారత్ తరపున 54 వరల్డ్ కప్ వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్ కూడా షమీనే. ఈ ప్రదర్శనతో ఒక్క ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గాను షమీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో కేవలం ఆరు మ్యాచ్లే ఆడిన షమీ 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇన్ని రికార్డులను సింగిల్ హ్యాండ్ తో బద్దలు కొట్టిన మహమ్మద్ షమీ నిన్నటి బౌలింగ్ ప్రదర్శన మాత్రం కింగ్ కోహ్లీ 50వ శతకంతో సమానం అయింది. అందుకే అంతటి కీలక మ్యాచ్లో కోహ్లీ మైల్డ్ స్టోన్ సెంచరీ కొట్టిన కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ షమీనే వరించింది. అందుకు షమీ పూర్తిగా అర్హుడు. కాగా తన భార్య కారణంగా… షమీ కొన్ని రోజులుగా నరకం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.