పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించాడు. ఈ నిర్ణయం కఠినమైనదైన ఇదే సరైన సమయమని భావిస్తున్నాడు. 3 ఫార్మాట్లలో ఓ ఆటగాడిగా పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం అంకితభావం కొత్త జట్టుకు, కెప్టెన్ కి ఇంకా సహాయ సహకారాలు అందిస్తాను కూడా అని బాబర్ అజామ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
కెప్టెన్ గా తనకు బాధ్యతలు అప్పగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బాబర్ అజామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ పాకిస్తాన్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరపరాజయం కూడా ఎదుర్కొంది. 9 మ్యాచ్ లకు నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల్లో సైతం టీం పర్ఫామెన్స్ పై ప్రభావం చూపించాయి.
Advertisement
Advertisement
ప్రపంచకప్ వైఫల్యంతో బాబర్ అజామ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బాబర్ అజామ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ కూడా వచ్చింది. ఇదే క్రమంలో బాబర్ అజామ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకున్నాడు. చెప్పాలంటే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే బాబర్ అజామ్ కూడా మూడు ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతరం కోహ్లీ సైతం ఇదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నాడు. వన్డేల నుంచి కోహ్లీని సారథిగా తప్పించడంతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా పాత కోహ్లీలా చెలరేగుతున్నాడు. ఇక బాబర్ అజామ్ కూడా తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. కొత్త కెప్టెన్ స్థానంలో ఎవరు వచ్చిన అతనికి పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.