టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకున్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఈ జంట ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పడంతో… వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే జూన్ లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఇక నవంబర్ ఫస్ట్ తారీఖున… ఇటలీలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీల మ్యారేజ్ జరిగిపోయింది. ఇటీవలే రిసెప్షన్ చేసుకున్న ఈ జంట… జాలిగా గడుపుతోంది. ఇదంతా పక్కకు పెడితే తాజా సమాచారం ప్రకారం… మెగా డాటర్ నిహారిక కోసం… లావణ్య త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.
Advertisement
రీసెంట్గా నిహారిక ప్రొడక్షన్ హౌస్ లో మెయిన్ స్ట్రీమ్ మూవీ లాంచ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిహారిక ప్రొడక్షన్లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఓ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ సినిమాలో వరుణ్ తేజ్ మరియు లావణ్య హీరో హీరోయిన్లుగా నటించాలని నిహారిక కోరినట్లు తెలుస్తోంది. దీంతో సంతానం ఆలోచన పక్కకు పెట్టి… నిహారిక కోసం సినిమా చేయాలని లావణ్య త్రిపాఠి డిసైడ్ అయ్యారట.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!