పాకిస్తాన్ ప్రజలు మంచి తిండి ప్రియులు . నాన్ వెజ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. దూద్ ( పాలు ) – పత్తి ( టీ పొడి ) పేరుతో నీళ్లు కలపని చాయ్ ను తాగడానికి ఇష్టపడతారు. ఇంకా వారు బాగా ఇష్టపడే ఫుడ్ ఐటమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం!
Advertisement
నహరి :
మటన్ బొక్కలను బాగా ఉండికించి తయారు చేసే సూప్ ఇది. చపాతీ, పరోటాలతో కలిపి తింటారు. పాకిస్తానీయుల బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది! లాహోర్ లోని వారిస్ నహారి వరల్డ్ ఫేమస్!
Advertisement
హల్వా పూరీ:
పాకిస్తానీల ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఇది! పూరీలకు కాంబినేషన్ గా మన దగ్గర ఆలు ఖుర్మా, బేసన్ సాగ్ ఇస్తారు. అక్కడ స్వీట్ హల్వా ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో స్వీట్ తినడం ఉత్తరప్రదేశ్ లో కూడా చూస్తుంటాం!
పరోటా:
మన దగ్గర పరోటా ను లంచ్, డిన్నర్ లలో తింటాం కానీ పాకిస్తాన్ లో దీన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ లో బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు.
లస్సీ :
పాకిస్తాన్ లో పాడి ఉత్పత్తులు ఎక్కువ కాబట్టి. అక్కడ అన్ని సీజన్స్ లో లస్సీ దొరుకుతుంది. డిఫరెంట్ ప్లేవర్స్ యాడ్ చేసి ఈ లస్సీని అమ్ముతుంటారు.