ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మాళవిక అందరికీ సుపరిచితమే. ప్రస్తుత కాలంలో ఈ అమ్మడు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పటి కాలంలో ఈ అమ్మడు సినిమాలను ప్రతి ఒక్కరూ చూసేవారు. ‘చాలా బాగుంది’ సినిమాతో మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఐదేళ్లపాటు తెలుగు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ అమ్మడు తన హవాను కొనసాగించింది.
Advertisement
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంది. ఇక మాళవిక 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మాళవిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రీసెంట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది.
Advertisement
ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రేక్షకులు వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక సుమారు 14 ఏళ్ల తర్వాత మాళవిక సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తమిళ్ లో సూపర్ అనే షో ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక మళ్లీ బిగ్ స్క్రీన్ పై అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతున్నారు. ఇక మాళవికని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!