ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అరవింద్ కి ఎలాంటి బాండింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రేంజ్ లో వారిద్దరూ క్లోజ్ గా ఉంటారో అందరికి తెలిసి. వారిద్దరిని కృష్ణార్జునులుగా కూడా సంబోధిస్తూ ఉంటారు. బావా, బామ్మర్దులే అయినా.. వారి ఇద్దరి మధ్య రిలేషన్ అంతకుమించి ఉంటుంది. అయితే.. వారిద్దరి మధ్య తెలియని దూరం ఉంది అంటూ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఉన్నట్లు ప్రస్తుతం వారిద్దరి మధ్యా ఆ బాండింగ్ లేదు అని ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.
Advertisement
ఒకప్పుడు చిరంజీవి ఏమి చేయాలన్నా, ఏ సినిమాలో నటించాలన్నా అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అల్లు అరవింద్ నే చూసుకునేవారు. చిరంజీవి చేసే ప్రతి ఈవెంట్ లోను అల్లు అరవింద్ కనిపించే వారు. అలానే, అల్లు అరవింద్ కు సంబంధించి అన్ని ఈవెంట్స్ లో చిరంజీవి కూడా కనిపించేవారు. అయితే ఈ మధ్య వీరు కలిసి కనిపించడం లేదు. అల్లు అరవింద్ ఈవెంట్స్ కి చిరు హాజరు అవడం లేదు.
Advertisement
అల్లు అర్జున్ కూడా మెగా టాగ్ ని తప్పిస్తూ.. అల్లు ఆర్మీ ని క్రియేట్ చేసుకోవడం కూడా ఈ టాక్ కి కారణం అవుతోంది. మెగా ఫామిలీ లో ఉన్న హీరోలు అందరు టాలెంట్ ఉన్నోళ్లే. అల్లు అర్జున్ ను కలుపుకునే నలుగురు టాప్ హీరోలు ఉన్నారు. అప్పట్లో చిరు ద్వారా అల్లు అరవింద్ బాగానే సంపాదించుకున్నాడు అనే టాక్ ఉండేది. చిరు సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్న అల్లు అరవింద్ ఆ సినిమాలు హిట్స్ అవడంతో బాగానే సంపాదించారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కొడుకు అల్లు అర్జున్ కూడా ఎదగడంతో.. చిరుని పక్కన పెట్టి వీరి వ్యవహారం వీరే చూసుకుంటున్నారని.. చిరంజీవి ఎప్పుడైనా కామ్ గానే ఉంటారు కాబట్టి ఈ వ్యవహారంపై స్పందించలేదని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!