అక్కినేని వారసుడు అఖిల్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అఖిల్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడడం లేదు. దీంతో చాలా కాలంగా అఖిల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో అఖిల్ తన తదుపరి చిత్రంలో నటించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అఖిల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడట.
ఈ విషయం తెలిసిన చాలామంది అక్కినేని ఇంటికి ఎవరు కోడలుగా వెళ్లబోతున్నారని తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…. అఖిల్ కొన్నేళ్ల క్రితం శ్రియ అనే అమ్మాయిని ప్రేమించాడు. కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు కూడా ఓకే చెప్పారు. ఇక వీరు ఎంగేజ్మెంట్ నీ ఘనంగా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక చాలాకాలం పాటు సింగిల్గానే ఉన్న అఖిల్ మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఈ విషయం తన ఇంట్లో చెప్పగానే నాగార్జున, అమల వెంటనే ఓకే చెప్పారట. ఆ అమ్మాయి ఓ టాప్ బిజినెస్ మ్యాన్ మనవరాలట. ఇక చాలాకాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరగబోతుందన్న సంతోషంలో అక్కినేని కుటుంబం ఉందట.
Advertisement
Advertisement
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. ఇక అఖిల్ కి వివాహం చేసిన తర్వాత నాగచైతన్యకు వివాహం చేయాలనే ఆలోచనలో కుటుంబసభ్యులు ఉన్నారట. ఇక అఖిల్ వివాహ అనంతరం నాగచైతన్యకు వివాహం జరుగుతోంది. ఈ విషయం తెలిసే చాలామంది ఫీల్ అవుతున్నారు. నాగచైతన్య, సమంత మళ్ళీ కలవాలని, వారిద్దరూ మునుపటిలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఇక అఖిల్ వివాహానికి స్టార్ సెలబ్రిటీలందరూ వస్తారు. మరి అఖిల్, సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి సమంతని వివాహానికి అఖిల్ పిలుస్తాడో లేదో చూడాలి. వివాహానికి వెళితే నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ చిగురిస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!