Home » Bigg Boss 7 : శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?

Bigg Boss 7 : శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?

by Bunty
Ad

 

శోభా శెట్టి ఈ పేరు చెబితే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా మోనిత అద్భుతమైన పాత్రను పోషించారు. తన విలనిజానికి ఎంతోమంది ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారు. కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ అంత కఠినంగా ఉంటుంది. ఇక ఈ సీరియల్ విజయవంతంగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక ఈ సీరియల్ ముగిసిన అనంతరం కూడా మోనితకి ఎనలేని క్రేజ్ ఉంది.

Shobha Shetty Lover In Bigg Boss Telugu 7 Who Is Yaswanth Karthika Deepam Actor

ఈవిడ పలు సీరియల్లలో మంచి అవకాశాలను అందుకుంటుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్-7లో చోటును సంపాదించుకుంది. ఇక ఈ షోలో తాను చాలా చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాకుండా టేస్టీ తేజతో కాస్త టాక్ ట్రాక్ నడిపించింది. కానీ వారిద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమే ఉంది. ప్రేమ అని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున జరిగిన ఎపిసోడ్ లో తనకు కాబోయే భర్త బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisement

Advertisement

అతను మరెవరో కాదు సీరియల్ యాక్టర్ యశ్వంత్. ఇతను సీరియల్స్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మూడున్నర ఏళ్లుగా రిలేషన్ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఆ విషయాన్ని బయట పెట్టలేదని, మొదటిసారిగా బిగ్ బాస్ స్టేజ్ మీద వీరి ప్రేమ విషయం అందరికీ తెలుస్తుందని శోభా చెప్పుకొచ్చింది. ఇక యశ్వంత్ కూడా శోభాను ఎంతగానో ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. ఇక త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading