ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్ళి చేసుకునేవారు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పై బడిపోతుంది.
Advertisement
ఇక మరికొందరు 30 ఏళ్ల వరకు లైఫ్ ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా కూడా వివాహాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 30 ఏళ్లు వస్తే జీవితంలో ఎలా స్థిరపడాలి ఎలా సంపాదించాలి అనే ఆలోచన తప్ప భాగస్వామితో ఎలా గడపాలి జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనలు రావట.
Advertisement
దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం కూడా ఉందట. అంతేకాకుండా ఇద్దరూ తమ జీవితాన్ని ఆశీర్వదించలేక పోయే అవకాశాలు ఉన్నాయట. పాతికేళ్ల లోపు లేదంటే పాతికేళ్లు నిండగానే వివాహం చేసుకుంటే పిల్లలను కనడానికి కూడా సరైన వయస్సట. పెళ్లి ఆలస్యం అయినట్లయితే పిల్లల యవ్వన వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు ముసలివారు అయిపోయే ప్రమాదం కూడా ఉంది.
దాంతో పిల్లల వివాహ బాధ్యతలను సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పాతికేళ్లలో వివాహం చేసుకుంటే ఐదేళ్ళపాటు జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టవచ్చట. డబ్బు సంపాదన, వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి వాటి పై ఫోకస్ పెంచవచ్చు. అయితే పెళ్లి అనేది పర్సనల్ విషయం. కానీ లేటుగా పెళ్లి చేసుకుంటే ఈ ఇబ్బందులు తప్పవని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.