ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన, 16వ తేదీన రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే నవంబర్ 16వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ మొత్తంలో మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచిన పాకిస్తాన్… ఇంటి దారి పట్టింది. అన్ని మ్యాచ్లలో దారుణంగా విఫలం కావడంతో సెమిస్ బరిలో నుంచి తప్పుకుంది పాకిస్తాన్ జట్టు. ఇక ఇవాళ పాకిస్తాన్ జట్టు తమ దేశానికి వెళ్లిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో పాకిస్తాన్ గోరంగా విఫలమైనందుకు… బాబర్ అజమ్ పై వేటు వేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
పాకిస్తాన్ ఇంత చెత్తగా ఆడడానికి కారణం కెప్టెన్ బాబర్ అజమ్ అని… వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో… పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ టార్చర్ భరించలేక… బాబర్ అజమ్ నరకం అనుభవిస్తున్నారట. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.