వన్డే ప్రపంచకప్ 2023 తుది దశకు చేరుకుంది. ఆదివారం అంటే ఈరోజున ఇండియా Vs నెదర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో లీగ్ దశకు తెరపడనుంది. ఇప్పటికే భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. టోర్నీ రూల్స్ ప్రకారం పాయింట్స్ టేబుల్ లో ఉన్న భారత్ ఇంకా నాలుగవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ తో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుండగా…. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు రెండో సెమీఫైనల్ ఆడనున్నాయి. నవంబర్ 15న ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది.
నవంబర్ 16 న కోల్కత్తా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకొనున్నాయి. రెండు సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్ జరగాల్సిన రోజు వర్షం లేదా మరే ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోతే మరుసటి రోజు ఆడిస్తారు. మొదటి రోజు ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో ఆ తర్వాత ఆ మ్యాచ్ ని అక్కడి నుంచి కొనసాగిస్తారు. మ్యాచ్ ఫలితం తేలాలంటే రిజర్వ్ డే తో కలుపుకొని రెండు రోజుల్లో ఇరుజట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడే డక్ వర్క్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని నిర్ణయిస్తారు.
Advertisement
Advertisement
అనివార్య కారణాలవల్ల ఈ రెండు రోజులు ఆట సాధ్యం కాక సెమీఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్ లో అత్యధిక పాయింట్స్ సాధించిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. పాయింట్స్ సమానంగా ఉంటే రన్ రేట్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ రూల్ ప్రకారం తొలి సెమీఫైనల్ జరగడం సాధ్యం కాకపోతే భారత్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఇక రెండో సెమీఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ చేరుకుంటుంది. తొమ్మిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా 14 పాయింట్లు +1.26 నెట్ రన్ రేట్ తో ప్రస్తుతానికి పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే మాత్రం ట్రోఫీని ఇరుజట్లు పంచుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.