ఆర్సీబీ టీమ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 2008 నుంచి ఐపీఎల్ టైటిల్ కొట్టేయాలని ఇక ప్రయత్నాలు చేస్తోంది ఆర్సిబి. ఆ జట్టులో హేమాహేమీలు ఉంటారు. భారీ స్కోర్లు చేస్తారు. కానీ మ్యాచ్ ల విషయంలో మాత్రం తడబడి ప్లే ఆప్స్ కు చేరకుండా కొన్నిసార్లు ప్లే ఆఫ్స్ కు చేరిన టైటిల్ కొట్టకుండా కొన్నిసార్లు నిరాశపరిచారు. కానీ 2024 ఐపీఎల్ లో మాత్రం ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆర్సిబి. అందుకే మినీ వేరంలో పరుగుల వరద బారించే ప్లేయర్ కోసం గాలం వేసింది. దానికి ఆ ప్లేయర్ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ లో దుమ్మురేపిన స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన ఈ ప్లేయర్ న్యూజిలాండ్ లో స్థిరపడి ఆ జట్టు తరపున ఆడుతున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఊహించని స్థాయిలో ప్రదర్శన చేశాడు. తొమ్మిది మ్యాచ్లో ఏకంగా మూడు సెంచరీలతో పాటు 625 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందుకే ఈ ప్లేయర్ ను దక్కించుకోవడానికి ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సిబి ముందుగా ఉంది. ఇప్పటికే అతనితో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రచిన్ రవీంద్ర కూడా ఆర్సిబి తరుపున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో నాకు బెంగుళూరు అన్న, చిన్నస్వామి స్టేడియంలో ఆడిన చాలా ఇష్టమని తెలిపారు. ఈ రెండు తన మనసులో చాలా దగ్గరగా ఉంటాయని చెప్పాడు.
Advertisement
Advertisement
దాంతో వచ్చే ఐపీఎల్ సీజన్ లో రచిన్ రవీంద్ర… ఆర్సిబి జెర్సీతో కనిపించే అవకాశాలు ఉన్నాయని అవకాశం ఉంది. కానీ రచిన్ రవీంద్రను మినీ వేలంలో కొనుగోలు చేస్తారా? లేదా డైరెక్ట్ గా జట్టులోకి తీసుకునే వీలుందా అనేది తెలియాలి. మినీ వేలంలోకి వస్తే మాత్రం ఈ స్పిన్ ఆల్ రౌండర్ కోసం జట్లు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. భారీ సెంచరీలతో ఆటు వికెట్లు తీస్తున్న ఈ ప్లేయర్ కోసం ఎంత పెట్టడానికైనా ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మినీ వేలంలో అత్యధిక ధర పలికే ఛాన్స్ ఉంది. మరి వచ్చే సీజన్ తనలో ఈ కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కనిపిస్తాడా లేదా వేరే జట్టులో కనిపిస్తాడా అన్నది చూడాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.