Home » శ్రీలంక వస్తే రాళ్లతో దాడి చేస్తాం.. షకీబ్‌కు వార్నింగ్ !

శ్రీలంక వస్తే రాళ్లతో దాడి చేస్తాం.. షకీబ్‌కు వార్నింగ్ !

by Bunty
Ad

 

ఇండియాలో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కానీ మెగా టోర్నీ చివరికి వచ్చిన తరుణంలో ఒక్క మ్యాచ్ దుమారం రేపుతోంది. వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ మాథ్యూస్ కు అవమానం జరిగింది. అతను ఒక్క బంతి కూడా ఆడకుండా టైమ్డ్ అవుట్ అయ్యాడు. దాంతో ప్రపంచ క్రికెట్ షాక్ అయింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా అవుట్ అయిన మొదటి బ్యాట్స్మెన్ మాథ్యూస్.

Angelo Mathews’ Brother Issues Warning to Shakib Al Hasan After ‘Timed Out’

ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత సరిగ్గా రెండు నిమిషాల్లో మరొక బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉండాలి. కానీ మాథ్యూస్ క్రీజ్ దగ్గరికి వచ్చినప్పటికీ హెల్మెట్ స్టాంపు ఊడిపోవడంతో వేరే హెల్మెట్ తెప్పించుకున్నాడు. కానీ టైం అయిపోవడంతో బంగ్లా కెప్టెన్ అవుట్ కోసం అప్లై చేశాడు. దాంతో అంపైర్లు అవుట్ గా ప్రకటించారు. దీంతో మ్యాథ్యూస్ ఎంత చెప్పినా బంగ్లా కెప్టెన్ వినలేదు. దాంతో మ్యాచ్ అయ్యాక తీవ్ర విమర్శలు చేశాడు మాథ్యూస్.

Advertisement

Advertisement

అతనితో పాటు మాజిలు, ఫ్యాన్స్ కూడా బంగ్లా టీం మీద అలాగే షకీబల్ హసన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక మాథ్యూస్ తమ్ముడు ట్రేవీస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. షకీబల్ హసన్ కి ఇక మీద శ్రీలంకలో చోటులేదని హెచ్చరించాడు. నైతిక విలువలు లేకుండా మ్యాచ్ కోసం దిగజారిన  షకీబల్ హసన్ ను లంక ఫ్యాన్స్ ఒప్పుకోరని విమర్శలు చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్ కోసం లేదా లంక ప్రీమియర్ మ్యాచ్ కోసం శ్రీలంక కు షకీబల్ హసన్ వస్తే రాళ్లతో కొడతారని వార్నింగ్ ఇచ్చాడు. దింతో షకీబల్ హసన్ పై అతను చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading