టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. 20 ఏళ్ల వయసులోనే భారతజట్టుకు ఎంట్రీ ఇచ్చిన గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డేలు, టి20లు, ఐపీఎల్లో స్టైలిష్ బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. ఈ వరల్డ్ కప్ లో సూపర్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు గిల్. ఇక లేటెస్ట్ గా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో వన్డేల్లో ఫస్ట్ ప్రైజ్ దక్కించుకున్నాడు ఈ డాషింగ్ ఓపెనర్. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా గిల్ రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
ర్యాంకింగ్స్ లో కింగ్ అయినప్పటి నుంచి గిల్ పై ప్రశంసల వర్షం పెరిగిపోయింది. తోటి క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ట్విట్స్ తో ట్విట్టర్ ఎక్స్ మోతమ్రోగిపోతుంది. అందరి ప్రశంసలు ఓక ఎత్తు…. ఈ అమ్మాయి శుభాకాంక్షలు ఇంకా స్పెషల్ అన్నట్టుగా మారిపోయింది సీన్. ఎందుకంటే సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గిల్ అని క్యాప్షన్ రాసింది. లవ్ ఎమోజి పెట్టింది. అంతే మనోడు నెంబర్ వన్ అయ్యాడు. ఈమె కూడా ఓపెన్ అయిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని, ఇప్పుడు ఓపెన్ అయిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
గిల్, సారాపై చాలా రోజులుగా రూమర్స్ ఉన్నాయి. అయితే మధ్యలో సారా అలీ ఖాన్ పేరు వినిపించిన గిల్ తో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది సారా అలీ ఖాన్. దీంతో అందరి దృష్టి గిల్, సారాపై పడింది. దాంతో వారిద్దరూ లంచ్ కు బయటికి వెళ్లారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే టైంలో వరల్డ్ కప్ మ్యాచ్లకు సారా రావడం, గిల్ ఇన్నింగ్స్ ను చూస్తూ ఉత్సాహపడడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గిల్ ఫోర్లు, సిక్స్ లు కొట్టినప్పుడు ఎంతగా కేరింతలు కొట్టిందో, అదేవిధంగా అవుట్ అయినప్పుడు చాలా డల్ గా కనిపించిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా లవ్ ఎమోజి పెట్టి గిల్ కు శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటే ఇద్దరి మధ్య లవ్ ఉందని ఊహగాణాలు నిజమేనంటున్నారు నెటిజన్లు. మరి నిజం ఏంటో వారు చెప్పేవరకు తెలియదు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.