రామానాయుడు గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు రామానాయుడు. ఆయన వారసులుగా ఇండస్ట్రీకి వెంకటేశ్, సురేష్ బాబు కూడా వచ్చారు. ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మూడవ తరం వారసులుగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఒకపక్క హీరోగా ఇంకొకపక్క విలన్ గా కూడా అదరగొడుతూ ఉంటాడు రానా. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ నెగిటివ్గా చేసినా కూడా ఫేమస్ అయిపోయాడు రానా. తన తండ్రితో గొడవ పడి దాదాపు నెలరోజులు మాట్లాడలేదట. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందని విషయానికి వచ్చేస్తే సినిమాల్లోకి రాకముందు స్టార్ హీరోల సినిమాకి విఎఫ్ఎక్స్ అందించేవాడు రానా స్పిరిట్ మీడియా అనే పేరుతో విఎఫ్ఎక్స్ మీడియా ని దాదాపు 18 ఏళ్లు క్రితం నడిపాడు.
Advertisement
Advertisement
విజువల్ ఎఫెక్ట్స్ మీడియా పెట్టిన ఐదేళ్లకే దాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు అయితే బాహుబలి వంటి సినిమాలను చేయాలని రానా అనుకున్నారట కానీ అటువంటి సినిమాలు ఏమీ కూడా రాలేదు. రానా దానిని ఇక అమ్మేయాలని అనుకున్నారు అది ఏదో సరదాగా పెట్టుకున్న వ్యాపారం కాదని ప్రైమ్ ఫోకస్ వాళ్ళకి అమ్మేసాడట. ఆ టైంలో సురేష్ బాబుకి రానాకి మధ్య ఎన్నో గొడవలు జరిగాయట దాదాపు నెలరోజుల పాటు ఇంట్లో సరిగ్గా మాట్లాడలేదట విసిగిపోయి రానా ఇంటికి వెళ్లడం మానేసాడట. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కంపెనీని అమ్మేయడం తప్ప ఇంకొక మార్గం కనబడలేదు రానాకి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!