Home » 15ఏళ్లకే లవ్….వైరల్ అవుతున్న అనసూయ లవ్ స్టొరీ…!

15ఏళ్లకే లవ్….వైరల్ అవుతున్న అనసూయ లవ్ స్టొరీ…!

by AJAY
Ad

జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీ లో కింది స్థాయి నుండి ఎదిగిన నటీమణుల్లో ఒకరు అనసూయ. అయితే ఈ బ్యూటీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి నట్టు తెలుస్తోంది. మొదట అనసూయ ఓ ఉద్యోగం చేసేది. ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ సిక్స్ లాయిడ్ అనే విజువల్ కంపెనీలో టెలీకాలర్ గా ఉద్యోగం చేసేదట.

jabardasth anasuya

jabardasth anasuya

అయితే ఆ సమయంలో చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు ఆ కంపెనీకి వెళ్లేవారట ఆ సమయంలో చాలామంది అనసూయకు సినిమా ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ కూడా తన సినిమా ఆర్య 2 లో ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు అనసూయ తెలిపింది. అయితే అంతకు ముందు అనసూయ ఓ బ్యాంకులో కూడా రూ.5 వేల జీతానికి ఉద్యోగం చేసేదట. తరవాత యాంకరింగ్ పై ఉన్న ఆసక్తి తో టీవీ 9 లో అనసూయ యాంకర్ గా చేరింది.

Advertisement

Advertisement

anasuya bharadwaj

ఆ తర్వాత జబర్దస్త్ షో లో యాంకర్ గా అవకాశం అందుకుంది. ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అనసూయ కూడా ఈ షోకు అంతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పొట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్లను ఆకర్షించింది. ఇక ప్రస్తుతం బుల్లితెర తో పాటు వెండితెరను సైతం షేక్ చేస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అనసూయ ప్రేమ పెళ్లి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

అనసూయ తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ప్రేమలో పడినట్టు ఆలీతో జాలీగా టీవీ షో లో తెలిపింది. మొదట ఎన్సిసి క్యాంప్ లో తన భర్త తో పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని తెలిపింది. ఇక తన భర్త తో కలిసి దిగిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అతడి పై ప్రేమను చాటుకుంటోంది.

Visitors Are Also Reading