పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రెండు మూడు సినిమాల్లో ఆమె నటించిన కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. టైగర్ నాగేశ్వర సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలకి ఆమె హాజరయ్యింది. తన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెప్పింది. అలానే తనకొక జబ్బు ఉన్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చింది, ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ రేణు దేశాయ్ నేను ఒక పుట్టుక లోపంతో పుట్టాను. ఆ బర్త్ డిఫెక్ట్ ని అధికమించడానికి చేసేదేమీ లేదు టెస్టులు చేయించుకున్న కొద్ది ఆ సమస్య ఏంటో తెలిసి వచ్చింది.
Advertisement
Advertisement
సీటీ స్కాన్ చేయించుకున్న తర్వాత జబ్బు ఉన్నట్లు తెలిసిందని దాని గురించి ఎవరు ఏం చేసేది లేదని అలాగే వదిలేసాను. మా నాయనమ్మ కి కూడా ఇదే సమస్య ఉందని రేణు దేశాయ్ చెప్పింది 47 సంవత్సరాలకే హార్ట్ ఎటాక్ తో వాళ్ల నాన్నమ్మ చనిపోయారట అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అని ప్రాణాయామ, యోగ, వ్యాయామం వంటివి చేస్తుంటాను అని చెప్పింది.
ఆహారం విషయంలో కూడా కంట్రోల్లో ఉంటానని, ఎలాంటి కొలెస్ట్రాల్ పేరుకుపోలేదు అని ఆమె చెప్పింది. బైపాస్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు కానీ పుట్టుకలోనే లోపం ఉన్నట్లు రేణు దేశాయ్ చెప్పింది. ప్రస్తుతం ఈమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి హార్ట్ రేట్ పైకి వెళ్లకుండా ఉండడానికి బీటా బ్లాకర్ అనే ఒక మెడిసిన్ ఇస్తారని కూడా రేణు దేశాయ్ చెప్పింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!