ప్రపంచకప్ పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకుంటే నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ మీద ఎవరికి పెద్దగా ఆసక్తి లేదు. కానీ మ్యాచ్ మొదలైన కొన్ని గంటలకే మాథ్యుస్ టైం అవుట్ నిర్ణయం వల్ల అందరూ తెగ చర్చించేసుకున్నారు. ఆ తర్వాత మ్యాచ్ కూడా చివరిదాకా కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగింది. చివరకు బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో శ్రీలంక టోర్నమెంట్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయింది.
కానీ తనను టైం అవుట్ చేసిన షకీబల్ హసన్ ను అవుట్ చేసి మాథ్యుస్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అవుట్ చేసిన తర్వాత షకీబల్ వైపు చూస్తూ వాచ్ చూపిస్తున్నట్టుగా మణికట్టు వద్ద నుంచి నాలుగుసార్లు టాప్ చేశాడు. రివేంజ్ పూర్తయినట్టు అనుకోవచ్చు. కానీ 279 పరుగుల స్కోర్ ను శ్రీలంక కాపాడుకోలేకపోయింది. నజ్మల్ హుస్సేన్ 90 పరుగులు, షకీబల్ హసన్ 82 చేయడంతో బంగ్లాదేశ్ మరో 53 బాల్స్ ఉండగానే టార్గెట్ చేజ్ చేసేసింది. చివర్లో వరుస వికెట్లు పడ్డా బంగ్లాదేశ్ కంగారు పడలేదు. ఈ టోర్నమెంట్లో ఆరు వరస ఓటముల తర్వాత విజయాన్ని నమోదు చేసింది.
Advertisement
Advertisement
‘టైమ్డ్ అవుట్’ అంటే ఏంటి?
తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో టైమ్డ్ అవుట్ కూడా చోటు చేసుకుంది. ఎంసిసి రూల్స్ ప్రకారం….. వికెట్ పడిన తర్వాత లేదా బ్యాటర్ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగితే తర్వాత వచ్చే బ్యాటర్ నిర్నిత సమయంలోగా క్రీజులోకి రావాలి. గ్రౌండ్ లోకి వచ్చి రెండు నిమిషాలలోపే తొలి బంతిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. లేదంటే బ్యాటర్ ను టైమ్డ్ అవుట్ గా ప్రకటిస్తారు. ఏంజేలో మాథ్యూస్ విషయంలో ఇదే జరిగింది.