వన్డే వరల్డ్ కప్ లో సెమిస్ రేసు ఆసక్తికరంగా మారుతుంది. రెండు జట్లు ఆల్రెడీ సెమీస్ చేరాయి. మిగతా రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో విజయాలు సాధించింది. 16 పాయింట్లతో లీగ్ టాపర్ గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే సెమీస్ కు అర్హత సాధించింది. సౌత్ ఆఫ్రికా ఎనిమిది మ్యాచుల్లో 6 మ్యాచులను గెలిచి 12 పాయింట్లను సాధించి సెమీస్‌కు చేరుకుంది. అయితే మరొక స్థానం ఆస్ట్రేలియాది పక్క. ఆసీస్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఐదు విజయాలు సాధించింది. పది పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. కాకపోతే రెండు, మూడు స్థానాలు అటూఇటూగా మారే అవకాశం ఉంది.
దీంతో నాలుగవ స్థానం కోసమే హోరాహోరీ కనిపిస్తోంది. నాల్గవ బెర్త్ కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పోటీల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ ఇప్పటికీ ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. నాలుగు విజయాలే సాధించింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. కివిస్ నెట్ రన్ రేట్ 0.398. పాకిస్తాన్ కూడా సరిగ్గా 8 మ్యాచ్‌లే ఆడింది. నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 8 పాయింట్లు సాధించింది. రన్ రేట్ పరంగా చూస్తే కివీస్ కంటే వెనుకంజలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది. ఎనిమిది పాయింట్లు సొంతం చేసుకుంది. రన్ రేట్ -0.330. టీమిండియా ఎలాగో టాప్ ప్లేస్ లో ఫిక్స్ అయింది. నాలుగో స్థానంలో ఉండే జట్టుతోనే సెమీస్ ఆడాల్సి ఉంటుంది. దీంతో సెమిస్ లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది. సెమీస్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడితే అదిరిపోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
Advertisement
Advertisement
దాయాదుల మ్యాచ్ మరో లెవల్లో జరుగుతుంది అంటున్నారు. అయితే పాకిస్తాన్ సెమీస్ చేరడం అంత ఈజీ కాదు. సెమిస్ చేరడానికి తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై బాబర్ సేన ఘనవిజయం సాధించాలి. రన్ రేటును మెరుగుపరుచుకోవాలి. ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా దాయాదిజట్లకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ ను లంక చిత్తు చేయడంతో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో మ్యాచులో కనీసం ఒకదాంట్లోనైనా ఆఫ్గాన్ కంగు తినాలి. లంకపై కివిస్ పంజా విసిరితే మాత్రం పాక్ కు కష్టమే. న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్ రేట్ ను సాధించడం పాకిస్తాన్ కు సవాల్ గా మారుతుంది. ఇక లంకపై కివీస్ గెలిచిన సెమిస్ చేరడానికి విలియంసన్ సేన ఇతర జట్ల ఫలితాల మీద ఆధార పడాల్సి ఉంటుంది. సెమీస్ చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ కు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆఫ్గాన్ తన చివరి రెండు మ్యాచుల్లో సంచలన విజయాలు సాధిస్తే సెమీస్ కు దూసుకుపోతుంది. కానీ పెద్ద జట్లపై గెలవడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో పాటు సౌత్ ఆఫ్రికాతో ఆఫ్గాన్ తలపడాల్సి ఉంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.