Home » వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ కి.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఎందుకు రాలేదంటే..?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ కి.. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఎందుకు రాలేదంటే..?

by Sravya
Ad

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకకి చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. చాలామంది స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు కూడా వచ్చారు కానీ కొంతమంది మాత్రం రాలేదు. చాలామంది సెలబ్రిటీలు ఈ వేడుకకి హాజరవ్వకపోవడానికి కారణం ఏంటనేది బయటకొచ్చింది. కొంతమంది సెలబ్రిటీలు హైదరాబాదులో లేరట ఇంకొంత మంది సెలబ్రెటీలు ఆదివారం కావడంతో వేర్వేరు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

Varun-lavanya

అందుకే ఈ వేడుకకి హాజరవ్వలేకపోయారు. నందమూరి హీరోలతో పాటుగా కొంతమంది సీనియర్ స్టార్స్ సైతం ఈ వేడుకకి హాజరు కాలేదు కొంతమంది ఈ వేడుకకి హాజరు అవ్వకపోయినా డైరెక్టర్ గా కలసి త్వరలో ఈ జంటని ఆశీర్వదించనున్నారని సమాచారం. వరుణ్ కొన్ని వారాలపాటు షూటింగ్ల కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వరుణ్ తేజ్ కి పెద్ద హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది వరుణ్ తేజ్ లావణ్య జోడి బ్యూటిఫుల్ జోడి అని వీళ్ళ కాంబినేషన్లో సినిమాలు వస్తే చూడాలని కూడా అభిమానులు ఆశపడుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading