ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా లేదంటే బెల్స్ వంటివి ఏమైనా కట్టాలన్న ఈరోజు ఏ వారం అని చూసుకుంటూ ఉంటారు. ఈ కాలంలో బాగా తగ్గింది కానీ పూర్వకాలంలో చాలామంది వారం మంచిదో కాదా చూసుకొని డబ్బులు ఇచ్చేవారు. ముఖ్యంగా మంగళవారం శుక్రవారం డబ్బులు ఎవరికి ఇచ్చేవారు కాదు.
Advertisement
ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదని చూసుకుంటారు. మంగళవారం, శుక్రవారం అస్సలు ఎవరికీ డబ్బులు ఇవ్వరు. అలానే పున్నమి అమావాస్య రోజుల్లో కూడా ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
Advertisement
పూర్వకాలం నుండి చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. మహాలక్ష్మి బృగు మహర్షి కూతురు. శుక్రవారం ను బృగువారం అంటారు. మంగళవారం కుజ గ్రహానికి సంబంధించినది. శుక్రవారం రుణం ఇస్తే తిరిగి రావడం కష్టమని, మంగళవారం నాడు అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని చాలామంది భావిస్తారు. శుక్రవారం డబ్బులు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇలా సెంటిమెంట్ చాలామంది పెట్టుకున్నారు.
మంగళవారం, శుక్రవారం సెంటిమెంట్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది. ఒకవేళ అత్యవసర సమయంలో లేదంటే అపాయకర సమయం వచ్చిందంటే ఆచారాలని పాటించడం మంచిది కాదు. మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని అనడంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పాటించడం వలన తప్పేమీ లేదు. కానీ ఆపద వేళలో ఇటువంటివి చూసుకుంటే అది మనకే ఇబ్బంది అవుతుంది చూసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!