Home » టెస్ట్ మ్యాచ్ లో తెల్లటి దుస్తుల్ని ఎందుకు వేసుకుంటారు..? కారణం ఏమిటి అంటే..?

టెస్ట్ మ్యాచ్ లో తెల్లటి దుస్తుల్ని ఎందుకు వేసుకుంటారు..? కారణం ఏమిటి అంటే..?

by Sravya
Ad

చాలామంది క్రికెట్ ని చూడడానికి ఇష్టపడుతుంటారు. అలానే ఆడుతూ ఉంటారు కూడా. ప్రపంచంలో ఎంతమంది క్రికెట్ అభిమానులు వున్నా భారత్ క్రికెట్ అభిమానుల్ని ఎవరు బీట్ చేయలేరు. ఐపీఎల్ వచ్చాక టెస్ట్ క్రికెట్ పై అభిమానం కొంతమేర తగ్గిపోయింది ఇక ఇది ఇలా ఉంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి తెలుపు రంగు జెర్సీలు వేసుకుంటూ ఉంటారు. ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీనే ఎందుకు వేసుకోవాలి..? దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

క్రికెట్ ఇండియాలో పుట్టలేదు. ఇంగ్లాండులో 16వ శతాబ్దంలోనే క్రికెట్ పుట్టింది. అయితే తెలుపు రంగు జెర్సీ గురించి చూస్తే… 18వ శతాబ్దంలో తెల్లని దుస్తుల్ని క్రికెట్లోకి తీసుకురావడం జరిగింది దాని వెనుక ముఖ్య కారణాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అంటే రాత్రి కూడా క్రికెట్ ఆడుతున్నారు. కానీ అప్పట్లో దాదాపు 8 గంటల పాటు సూర్యుడు నడి నెత్తిపై ఉన్నప్పుడు, ఆడేవారు తెల్లని దుస్తులు వేసుకుంటే సూర్యకాంతిని అవి రిఫ్లెక్స్ చేస్తాయి కనుక ఆటగాడు శరీరంపై తీవ్రమైన ఎండ ఒత్తిడి కలగదు.

Advertisement

వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం తెలుపు రంగు బట్టల్ని వాడడం జరిగింది. పైగా ఎర్రటి బంతిని మాత్రమే ఉపయోగించేవారు. తెల్లటి దుస్తులు వేసుకుని ఎర్రటి బంతితో ఆడితే క్లియర్ గా బాల్ కనపడేది. ఇలా ఈ విధంగా తెలుపు రంగు జెర్సీని వాడడం అప్పట్లో జరిగింది. పైగా బ్రిటిష్ వాళ్ళు తెలుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రంగు వేసుకుంటే అందరూ సమానంగా ఉంటారని, వారి యొక్క భావన ఇలా అప్పటినుండి కూడా ఆ జెర్సీ ని వాడడం జరుగుతోంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading