వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలో విజయం సాధించి సెమిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సెమిస్ లోకి ఎంటర్ ఇచ్చిన టీమ్ ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధి కృష్ణను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ పాలక మండలి. అయితే ప్రసిద్ధ కృష్ణ ను తీసుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. అతని ప్లేస్ లో సంజు శాంసన్, చాహల్, లేదా అక్షర్ పటేల్ లలో ఎవరినో ఒకరిని తీసుకుంటే బాగుండు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. క్రీడా విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. పాండ్యా స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంటే… చాలా బెటర్ అని అంటున్నారు కొంతమంది. అక్షర్ పటేల్ 10 ఓవర్ల కోట వేయగలడు అలాగే బ్యాటింగ్ కూడా చేయగలడు. అంటే హార్దిక్ పాండ్యా లాగే ఆల్రౌండర్ పాత్ర పోషించగలడు. కానీ అతన్ని తీసుకోలేదు బిసిసిఐ.
Advertisement
Advertisement
ఇక అటు పాండే స్థానంలో సంజు శాంసన్ ను తీసుకున్న టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా ఉండేదని కొంతమంది అంటున్నారు. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెంచుకునేందుకు… సంజు ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ప్రసిద్ధి కృష్ణ వల్ల బ్యాటింగ్ అస్సలు కుదరదు. అతడు కేవలం బౌలింగ్ మాత్రమే చేయగలడు. ఇప్పటికే టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రసిద్ధ కృష్ణకు ఛాన్స్ అసలే రాదు.ఇక పాండ్యా స్థానంలో చాహల్ కు అయినా అవకాశం ఇస్తే… ఎక్స్ ట్రా స్పిన్నర్ కింద టీమిండియా కు అవకాశం ఉండేది. కానీ అలాంటి పని చేయకుండా ఒక బౌలర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణను తీసుకొని బీసీసీఐ తప్పు చేసిందని కొంతమంది అంటున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.