Home » ఇండియా బౌలర్లకు ICC స్పెషల్ బాల్స్ ఇస్తోంది.. పాక్ మాజీ క్రికెటర్ సంచలనం

ఇండియా బౌలర్లకు ICC స్పెషల్ బాల్స్ ఇస్తోంది.. పాక్ మాజీ క్రికెటర్ సంచలనం

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ గేర్ లో దూసుకుపోతోంది. లీగ్ దశలో ఇప్పటికే 7 విజయాలు సాధించి సెమీఫైనల్ లోకి ప్రవేశించింది. అయితే భారత బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్ తో ఔరా అనిపిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్స్ భయపడేలా బౌలింగ్ చేస్తున్నారు. భారత బౌలర్ల ప్రదర్శనకు క్రికెట్ ప్రపంచం సలాం కొడుతోంది. అయితే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ హసన్ రజా మాత్రం భారత బౌలర్ల ఫామ్ ను జీర్ణించుకోలేకపోతున్నాడు. బూమ్రా, సిరాజ్, షమీ బౌలింగ్ పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు ఐసీసీ స్పెషల్ బాల్స్ అందిస్తుందని ఆరోపణలు చేశాడు. ఓర్వలేనితనాన్ని బయట పెట్టుకున్నాడు. శ్రీలంకను భారతజట్టు 55 పరుగులకే అల్ అవుట్ చేశాక, హసన్ రజ రగిలిపోయాడు.

ICC, Umpires, BCCI Providing Special Balls for Indian Bowlers’, Claims Former PAK Cricketer

 

స్వింగ్ సీమ్ తో బౌలింగ్ చేయడానికి ప్రత్యేకమైన బాల్సే కారణమన్నాడు. రివ్యూలు కూడా రోహిత్ సేనకు అనుకూలంగా వస్తున్నాయన్నారు. ఇరుజట్ల బౌలర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం స్వింగ్ సీమ్ దొరకడం లేదన్నారు. ఈ వ్యవహారంలో థర్డ్ అంపైర్, బీసీసీఐ పాత్ర కూడా ఉందని ఆరోపణలు గుప్పించాడు. హసన్ రజా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ను టీమిండియా అభిమానులు ఆడేసుకుంటున్నారు. భారత ఆటను చూసి ఓర్వలేకే చీప్ కామెంట్స్ చేశాడని ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం స్పందించాడు. హసన్ రజా కామెడీ షోలో పాల్గొన్నట్టు ఉన్నాడని బౌన్సర్ సంధించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా ట్వీట్ చేశాడు.

Advertisement

Advertisement

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యాడు. రెండు జట్ల బౌలర్లు ఒకే బాక్స్ నుంచి బంతులు తీసుకుంటారని గుర్తుచేశాడు. హసన్ రజా మానసిక పరిస్థితిని ఒకసారి చెక్ చేయాలని సెటైర్ వేశాడు. నిజానికి వన్డే వరల్డ్ కప్ లో భారత బౌలర్లు మరో లెవల్లో బౌలింగ్ చేస్తున్నారు. అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు అనేలా మెరుపులు మెరిపిస్తున్నారు. ఫస్ట్ బౌలింగ్ చేసిన, సెకండ్ బౌలింగ్ చేయాల్సి వచ్చిన తగ్గడం లేదు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోతుంది. సెమిస్ చేరడం కూడా కష్టమే అనుకునే స్టేజ్ లో పాక్ జట్టు ఉందని చర్చ జరుగుతోంది. ఈక్వేషన్ అంత ఈజీగా ఏం లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడినా పాక్ మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మూడో మ్యాచ్లో చిత్తుఅయింది. ఆరు పాయింట్లు మాత్రమే సాధించింది. పాక్ పతనాన్ని తట్టుకోలేక భారత్ పై హసన్ రజా ఆరోపణలు గుప్పించాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading