2023లో భారీ విజయాలు సాధిస్తూ సెమిస్ కు చేరింది. టీమిండియా లీగ్ స్టేజ్ లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత సెమిస్ లో పోటీకి సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎలాంటి అవంతరాలు రాలేదు. కానీ టీమిండియాకు వచ్చిన ఒకే ఒక సమస్య ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం. బంగ్లాదేశ్ మ్యాచ్ లో గాయపడిన పాండ్యా అప్పటినుంచి జట్టుకు దూరమయ్యారు. ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దాంతో ఎన్సీఏకు తరలించి చికిత్స అందించారు. మొదట అతడు కొన్ని మ్యాచ్ లకు మాత్రమే దూరం అవుతాడని అందరూ అనుకున్నారు.
కానీ అతను గాయం తగ్గకపోవడంతో లీడ్ మ్యాచ్లకు రెస్ట్ ఇచ్చి నాకౌట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ అలాగే బీసీసీఐ భావించింది. కానీ ఇంకా అతను పూర్తిగా కోలుకోలేదు. సెమీస్ కు సమయం దగ్గర పడుతుండడంతో అతను జట్టుకు తిరిగి వచ్చేది కష్టమే అని అంటున్నారు. దాంతో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాంతో అతన్ని వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పించింది. అతని ప్లేస్ లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణకు అవకాశం కల్పించింది. ఆదివారం సౌతాఫ్రికాతో కోల్కత్తా జరిగే మ్యాచ్ కు ప్రసిద్ద్ జట్టులో చేరతాడని బీసీసీఐ తెలిపింది. నాకౌట్ మ్యాచ్లో పాండ్యా లాంటి ఆల్ రౌండర్ లేకపోవడంతో టీమిండియాకు కాస్త ఎదురుదెబ్బ అని చెప్పాలి. పాండ్యా జట్టులో ఉంటే బ్యాటింగ్ తో పాటు అదనంగా బౌలింగ్ కు కూడా ఉపయోగపడేవాడు.
Advertisement
Advertisement
ఈ మెగా టోర్నీలో ఆసీస్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు దురదృష్టం వెంటాడింది. దాంతో వరల్డ్ కప్ లో ఫైనల్స్ ఆడాలని పాండ్యా కోరిక తీరకుండానే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక పాండ్యా స్థానంలో జట్టులో చేరిన ప్రసిద్ద్ కృష్ణ మంచి ఫామ్ లో ఉన్నాడు. గాయం తర్వాత కోలుకున్న ప్రసిద్ద్ వరల్డ్ కప్ కు ముందు ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో బుమ్రా కెప్టెన్సీలో ఆడాడు. ఆ సిరీస్ కు ప్రసిద్ద్ రాణించాడు. ఇక కోల్కత్తాలో సౌత్ ఆఫ్రికా తో జరిగే మ్యాచ్ లో ప్రసిద్ద్ కు ఛాన్స్ రాకపోయినా ఆ తర్వాత నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ మ్యాచ్ లో సీనియర్ బౌలర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక సెమిస్ కు ముందు పాండ్య పూర్తిగా దూరం కావడంతో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.