ఈరోజుల్లో, చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు, అమ్మాయిలులో కొన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి ఇటువంటి మార్పులు ద్వారా అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతోందని చెప్పొచ్చు. అయితే చాలామంది నిజమైన ప్రేమకి లేదంటే ఇంఫాక్చువేషన్ కి మధ్య తేడా అని తెలుసుకోలేకపోతున్నారు. అయితే అబ్బాయిని ఇష్టపడుతున్నట్లయితే అమ్మాయిలు కొన్ని మార్పులు వస్తాయి ముఖ్యంగా హార్ట్ బీట్ పెరగడం అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి అమ్మాయిల హార్ట్ బీట్ పెరగడం వంటివి కనపడుతూ ఉంటాయి. అలానే అబ్బాయి దగ్గరికి వచ్చినా లేదంటే చుట్టుపక్కల ఉన్న ఆ అమ్మాయి కళ్ళు అటూ ఇటూ తిప్పడం లేదంటే కళ్ళు పెద్దవి చేయడం ఇటువంటి లక్షణాలు కనబడతాయి.
Advertisement
ఒకవేళ కనుక మీ చుట్టూ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు. అలానే ఆనందం కూడా ఎక్కువ ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్తాను ఆఫీస్‌కి లేదంటే అతను ఉన్నచోటకి ఇటువంటివి అనిపిస్తూ ఉంటాయి. హార్మోన్స్ లో వచ్చే మార్పులు వలన ఇలా అనిపించడం సహజం. ఇటువంటివన్నీ కూడా లవ్ లో ఉన్నప్పుడు కలుగుతాయి. అమ్మాయిల్లో ఒక మంచి వ్యక్తి కనుక లైఫ్ లోకి వచ్చారంటే లైఫ్ అంతా కూడా మారిపోతుంది.
Advertisement
ఇప్పటిదాకా ఏదో ఉన్నాంలే ఏదో చేసాంలే అన్నట్టుగా ఉన్నవాళ్లు కూడా ఓ రేంజ్ లో హ్యాపీనెస్ ని పొందుతారు. పైగా లైఫ్ లో ఎంతో ప్రశాంతత కంఫర్ట్ కలుగుతుంది పైగా స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుందట. నిజమైన ప్రేమలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా లైఫ్ లో కూడా బాగుండాలని ఫోకస్డ్ గా ఉంటారు. ఉదాహరణకి ఈ అబ్బాయిని నేను కనుక పెళ్లి చేసుకోవాలంటే నేను లైఫ్ లో ఇంతవరకు సక్సెస్ అవ్వాలి మంచి జాబ్ రావాలి లేదంటే లైఫ్ లో ఇంత స్టేజ్ లోకి వెళ్ళాలి. ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అది స్వచ్ఛమైన ప్రేమ అని మనం అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిని చేరుకోవాలంటే ముఖ్యంగా ముందు నేను ఇది చేయాలి అని చెప్పి దాని మీద ధ్యాస పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా స్వచ్ఛమైన ప్రేమలో ఉన్న అమ్మాయిల్లో ఇవి కనబడతాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!