Home » నా కూతురు పెళ్లికి మీరు రావొద్దు అని జయలలిత కి కృష్ణ ఫోన్ చేసి ఎందుకు చెప్పారు..? కారణం ఏమిటి..?

నా కూతురు పెళ్లికి మీరు రావొద్దు అని జయలలిత కి కృష్ణ ఫోన్ చేసి ఎందుకు చెప్పారు..? కారణం ఏమిటి..?

by Sravya
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ కృష్ణ గురించి పరిచయం చేయక్కర్లేదు సూపర్ సార్ కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాలు అలానే ఇతర అంశాల్లో కూడా ఎప్పుడు కృష్ణ చాలా ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే వారట కృష్ణ. తన కూతురు పెళ్లప్పుడు జయలలిత కి ఫోన్ చేసి కూతురు పెళ్ళికి రావద్దని ఆయనే స్వయంగా చెప్పేసారట. కృష్ణ కూతురు పెళ్లికి మూడు రోజుల ముందు కృష్ణ ఇంటికి వచ్చిన జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ ఒక రిక్వెస్ట్ చేశారట.

Advertisement

Advertisement

పెళ్లికి సీఎం వస్తున్నారని సెక్యూరిటీ రీజన్స్ వలన జయ లలిత ఆమెతో పాటు వచ్చే వాళ్లకోసం కళ్యాణ మండపంలో ముందు మూడు వరుసలు కేటాయించాలని కోరారు కానీ కృష్ణ ఒప్పుకోలేదు. అందుకు కారణం అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో చాలా మంది రాజకీయ సినీ ప్రముఖుల్ని అక్కడికి పిలవడం జరిగింది. అందుకని వాళ్ళని పక్కన పెట్టేస్తే మంచిది కాదని జయలలితకి ఫోన్ చేసే కృష్ణ మీరు వివాహానికి రావద్దు. దంపతులకి మీ ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పేశారు.

దాంతో జయలలిత నవ్వేసి పెళ్లిరోజు నూతన వధూవరుని ఆశీర్వదిస్తూ ఒక బొకేని పంపించారట. చెన్నైలో ఆడంబరంగా చేసిన కృష్ణ పెద్ద కూతురు పద్మావతి పెళ్లి కి ఏపీలో రాజకీయ ప్రముఖులతో పాటుగా అప్పటి తమిళనాడు సీఎం జయలలితను కూడా ఆహ్వానించారు. కానీ ఇలా జరిగింది. కృష్ణతో గూఢచారి 116 నిలువు దోపిడీ వంటి సినిమాల్లో జయలలిత నటించారు. మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళమధ్య. అందుకని పెళ్ళికి ఆహ్వానించారు కృష్ణ.

 

Visitors Are Also Reading