నిర్మలమ్మ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు నిర్మలమ్మ మచిలీపట్నంలో పుట్టారు. గరుడ గర్భ భంగం అనే సినిమాతో తొలిసారిగా ఈమె తెరి మీద కనబడ్డారు. తర్వాత ఈమె పాదుకాపట్టాభిషేకం, కృష్ణ ప్రేమ, కులగోత్రాలు మొదలైన సినిమాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. మంచి నటిగా గుర్తింపును కూడా తెచ్చుకున్నారు నిర్మలమ్మ. హీరోయిన్ సావిత్రి తర్వాత రియల్ నటిగా పేరు తెచ్చుకున్న నిర్మలమ్మ దాదాపు రెండు తరాల ప్రేక్షకుల్ని అల్లరించారు. అందరికీ బాగా దగ్గరయ్యారు. సినిమాల్లోనే కాకుండా రియల్ జీవితంలో కూడా ఎంతో మంది మనసుల్ని ఈమె గెలుచుకున్నారు.
Advertisement
Advertisement
మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మలమ్మ ఆకలితో తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాదనికుండా కడుపు నింపేది. అలాంటి అన్నపూర్ణ చివరి రోజుల్లో ఎన్నో కష్టాలని ఎదుర్కొంది ఎన్నో బాధల్ని భరించాల్సి వచ్చింది. నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా విషాదాలు ఉన్నాయి ఆమె ఎవరినీ పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా లేవు. కవిత అనే కూతుర్ని దత్తత తీసుకుంది. ఆ తర్వాత చాలామందికి సహాయం కూడా చేస్తూ ఉండేవారు. సినిమాల నుండి బయటకు వస్తున్న రోజుల్లో డయాబెటిస్తో ఆమె బాధపడ్డారు కానీ ఆమె చూసిన వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోలేదు.
నిర్మలమ్మ సహాయంతో పెరిగి పెద్దయి జీవితంలో ఎదిగినా ఆమె బాగోగులు మాత్రం చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు, ఆత్మ విశ్వాసంతో తన ఆరోగ్య విషయాలను కూడా ఆమె ఎవరికీ చెప్పలేదు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం నిర్మలమ్మ గురించి ఆలోచించలేదు. చివరి రోజుల్లో ఆమె ఎంతో మదన పడుతూ ఉండేవారు తనని ఎవరూ పట్టించుకోలేదని బాధపడి చివరగా ఆమె చివరికి 2009 ఫిబ్రవరి 19న చనిపోయారు. ఆమె ఆదరించే వాళ్ళు లేక బాధపడుతూ చనిపోయినట్లు తర్వాత ఆ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవడం చూసి అభిమానులు బాగా ఎమోషనల్ అయ్యారు.