హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మూడుముళ్లతో ఒకటయ్యారు. తెలుగు ఇంటి కోడలు అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్తోంది. చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అన్నారు. అలా ఆయన అన్నట్టే లావణ్య త్రిపాఠి తెలుగు ఇంటి కోడలు అయిపోయింది. పైగా అల్లు అరవింద్ ఫ్యామిలీ కి చెందిన అబ్బాయిని లావణ్య పెళ్లి చేసుకుంది.
Advertisement
ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి ఆమె జీవితంలో ఉంది. లావణ్య త్రిపాఠి సినిమాలో చెప్పిన డైలాగ్ ఆమె జీవితంలో నిజంగా జరిగిపోయింది. అందాల రాక్షసి సినిమాలో లావణ్య దగ్గరికి చిన్నపిల్లలు వచ్చి, అక్క నీ పెళ్ళికి సినిమా హీరోలు వస్తారట కదా చిరంజీవి కూడా వస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు లావణ్య త్రిపాఠి అవునని చెప్తుంది.
Advertisement
గ్యాంగ్ లీడర్ పెళ్ళికి వస్తున్నాడంట అని పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అక్కడినుండి వెళ్ళిపోతారు. 2012లో అందాల రాక్షసి సినిమాలో ఆమె ఈ డైలాగ్ చెప్తుంది. లావణ్య పెళ్లికి చిరంజీవి వచ్చారు. చెప్పాలంటే మెగా హీరోలు అందరూ కూడా ఆమె పెళ్ళికి వచ్చారు. ఆమె మెగా కోడలు అయిపోయింది. ఇలా ఈ రెండు సంఘటనలు కూడా ఆమె లైఫ్ లో అనుకోకుండా జరిగాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!