వన్డే వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మాక్స్వెల్ అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. సరదాగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్వెల్ గాయపడ్డాడు. సోమవారం క్లబ్ హౌస్ నుంచి టీం హోటల్ కు వచ్చే క్రమంలో మ్యాక్స్వెల్ కిందపడినట్లు తెలుస్తోంది. దీంతో తలకు తీవ్రగాయం అయింది. ఆస్ట్రేలియా క్రికెట్ రూల్స్ ప్రకారం మాక్స్వెల్ ను 6 నుంచి 8 రోజుల వరకు మెడికల్ పర్యవేక్షణలో ఉండనున్నారు.
దీంతో మ్యాక్స్వెల్ శనివారం ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నాడు. నవంబర్ ఏడో తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు కూడా మ్యాక్స్వెల్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అయితే మ్యాక్స్వెల్ కు అయిన గాయం మరి పెద్దది కాకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ జట్లతో జరిగే మ్యాచుల అనంతరం మ్యాక్స్వెల్ జట్టులో రీయంట్రి ఇవ్వనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యాక్స్వెల్ గైర్హాజరీ ఆస్ట్రేలియాకు నష్టం చేయనుంది. మ్యాక్స్వెల్ బ్యాటింగ్ అంటే అతని ఆఫ్ స్పిన్ అ జట్టుకు కీలకం.
Advertisement
Advertisement
మ్యాక్స్వెల్ గైర్హాజరిలో ట్రావిస్ హెడ్ స్పిన్ బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ తో జరిగిన గత మ్యాచ్ లోనే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు మ్యాక్స్వెల్ గైర్హాజరీతో ఆస్ట్రేలియా స్టోయినిస్, కెమెరన్ గ్రీన్ ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వరుసగా రెండు పరాజయాలతో టోర్నీని ప్రారంభించిన ఆసీస్ ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో నాలుగు మ్యాచ్లు గెలిచి సెమీస్ లో నిలిచింది. సెమీస్ బెర్త్ ఖాయం కావాలంటే ఆ జట్టు చివరి మూడు మ్యాచుల్లో కనీసం రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆసిస్ తలపడాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.