Home » ప్రపంచంలోని మొట్టమొదటి ATM మెషిన్ గురించి మీకు తెలుసా..? భారత్ తో కనెక్షన్ ఏమిటంటే..?

ప్రపంచంలోని మొట్టమొదటి ATM మెషిన్ గురించి మీకు తెలుసా..? భారత్ తో కనెక్షన్ ఏమిటంటే..?

by Sravya
Ad

డబ్బులు కోసం బ్యాంకులు కి వెళ్లి క్యూ కట్టి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏటీఎం లు వచ్చాక లేదు. ఏటీఎంలు వచ్చిన తర్వాత క్యాష్ ని ఈజీగా మనం విత్ డ్రా చేసుకోవచ్చు ఏటీఎం మిషన్ల ద్వారా ఎన్నో సర్వీసులని తర్వాత నెమ్మదిగా బ్యాంకులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే ఇవేమీ అక్కర్లేదు ఇప్పుడు ఈజీగా మనం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎవరికి కావాల్సిన అమౌంట్ ని మనం వాళ్ళకి పంపించవచ్చు అలానే డబ్బులు అని కూడా మనం ఈజీగా మన అకౌంట్లోకి పొందుతున్నాము.

Advertisement

అయితే మొదటిసారి ఏటీఎం ని ఎవరు కనిపెట్టారు..? ఏటీఎం ఎప్పుడు వచ్చింది వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చాలామందికి ఈ విషయాలు తెలీవు. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఎటిఎం ని జాన్ షెపర్డ్-బారన్‌ కనుగొన్నారు. జూన్ 23, 1925న భారతదేశంలోని షిల్లాంగ్‌లో పుట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎం ని జూన్ 27, 1967న యునైటెడ్ కింగ్‌డమ్‌ లోని నార్త్ లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో ఉన్న బార్క్లేస్ బ్యాంక్ శాఖలో పెట్టారు.

Advertisement

సర్ థామస్ బ్లాండ్ చేతుల మీదుగా ఏటీఎం మిషన్ ని ఓపెన్ చేసారు. నటుడు రెగ్ వార్నీ మొదటి ట్రాన్సక్షన్ చేశారు. తర్వాత నెమ్మదిగా ఏటీఎంలు చాలా చోట్ల పెట్టారు ఇప్పుడైతే ఊరికి ఎన్నో ఏటీఎం మెషిన్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే రోజురోజుకీ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది దాంతో ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా అవుతోంది. ఇప్పుడు సులభంగా మనం ఇంట్లో ఉండి నచ్చిన వాటిని షాపింగ్ చేయడం మొదలు ఎవరికైనా డబ్బులు పంపడం దాకా ఈజీగా మొబైల్ ద్వారానే పంపియవచ్చు. పైగా క్షణాల్లో పేమెంట్స్ చేసేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈజీగా పేమెంట్ చేసేయడం కుదురుతుంది కనుక  చాలా మంది డబ్బులు విత్ డ్రా చేయడం కూడా తగ్గించేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading