2023లో పాకిస్తాన్ తన రేంజ్ కు తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. కానీ బిర్యానీ విషయంలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ ప్లేయర్లు ఫుల్ గా బిర్యాని లాగించేశారు. హోటల్ లో డిన్నర్ వద్దనుకుని మరీ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. కోల్కతా బిర్యాని టేస్ట్ చేశారు. ఫేమస్ వంటకాలను రుచి చూశారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ ద్వారా నచ్చిన వంటకాలను తెప్పించుకుని తిన్నారు. కోల్కతాలోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ, కబాబ్స్ లను ఆర్డర్ చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా రెస్టారెంట్ కు చెందిన డైరెక్టర్ చెప్పారు. ముందుగా తమకు పాక్ ప్లేయర్స్ నుంచి ఆర్డర్ వచ్చిందని తెలియదని అన్నారు. కోల్కత్తా బిర్యానీ చాలా ఫేమస్ అన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు కూడా తాము చేసిన బిర్యాని నచ్చి ఉంటుందని అన్నారు. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లను హైదరాబాద్లోని పాక్ జట్టు ఆడింది. అప్పుడు కూడా పాక్ ప్లేయర్లు హైదరాబాద్ బిర్యానీని రుచిచూశారు. లోకల్ వంటకాలను టేస్ట్ చేశారు.
Advertisement
Advertisement
అప్పట్లో పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ పై దుమారం రేగింది. ఆహారపు అలవాట్లను కూడా కొందరు మాజీ ఆటగాళ్లు తప్పు పట్టారు. ఆఫ్గాన్ చేతిలో బాబర్ సేన ఓడిపోయాక మాజీ ప్లేయర్ వసీమ్ అక్రమ్ ఫైర్ అయ్యారు. రోజుకు ఎనిమిది కిలోల మాంసం తింటున్నట్టుగా కనిపిస్తున్నారని సంధించారు. ఇప్పుడు కోల్కతాలో పాక్ ప్లేయర్లు బిర్యానీని లాగించేశారని తెలిసి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ జరుగుతోంది. ఆట కంటే ఫుడ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.