ప్రపంచకప్ లో గిల్ ఫ్లాప్ షో నడుస్తోంది. టోర్నీకి ముందు జరిగిన సిరీస్ లలో వరుసగా సెంచరీలను నమోదు చేసి ఆడాల్సిన టోర్నీలో నిరాశపరుస్తున్నాడు. ఆరు మ్యాచ్లు జరిగితే గిల్ కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. డెంగ్యూ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లకు దూరంగా ఉన్న గిల్… పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్లో కేవలం 16 పరుగులు చేసే తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్ పై 26, ఇంగ్లాండ్ పై 9 పరుగులతో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్ లో ఉండే రోహిత్ శర్మ చెలరేగిపోతుంటే గిల్ కనీసం అతనికి తోడుగా నిలబడలేకపోతున్నాడు. దీంతో గిల్ ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు కొందరు. అయితే ఇక్కడ గిల్ ఆటను తక్కువ అంచనా వేయడం లేదు. వన్డే ఫార్మాట్లో గిల్ అద్భుతంగా ఆడగలరు. పైగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన దమ్మున్న ప్లేయర్…కానీ గిల్ ను డెంగ్యూ సమస్య ఇంకా వదలడం లేదు. అవును డెంగ్యూ వల్ల గిల్ పర్ఫామెన్స్ తగ్గిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. పైగా డెంగ్యూ ద్వారా ఆరు కిలోల బరువు తగ్గాడు. అందువల్లనే గిల్ లో జోష్ తగ్గిందని అంటున్నారు.
Advertisement
Advertisement
మొన్నటివరకు గిల్ ను సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు. తాజాగా గిల్ తన ప్రదర్శనపై రియాక్ట్ అయ్యాడు. ఆరంభ మ్యాచ్లు ఆడనందుకు చాలా బాధపడ్డానని టీమిండియాకు దూరంగా ఉండడం ఎంత కష్టమో నేను ఆ బాధను భరించానని తెలిపాడు. డెంగ్యూ నుంచి కోలుకోవడం చాలా కష్టమని చెప్పినా…అతను డెంగ్యూ ఎలా వచ్చిందో కూడా తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడే ఆటగాడు కావాలి. ఇప్పుడిప్పుడే టీం లో సెటిల్ అవుతున్న గిల్ కు ఇదే మొదటి వరల్డ్ కప్. టోర్నీకి ముందు మెరుపులు మెరిపించిన గిల్ మెగా టోర్నీలో అదే స్థాయిలో ఆడతాడని అనుకున్నారు అందరూ. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో గిల్ తడబడుతున్నాడు. అయితే గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను తీసుకోవాలని కొందరు అంటున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.