ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా… ఈమధ్య జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఓ ప్రభంజనం చోటుచేసుకుంది. అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ లో.. పాకిస్తాన్ జట్టుపై అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ గెలవడం గమనార్హం. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు… నిర్మిత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.
అయితే ఆ లక్ష్యాన్ని అవలీలగా… ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేదించింది. ఈ మ్యాచ్లో 49 ఓవర్లు వాడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ విజయం అనంతరం ఇండియా ఫ్లాగ్ పట్టుకొని రషీద్ ఖాన్… డాన్స్ చేసినట్లు కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేశారు.
Advertisement
Advertisement
దీంతో… కోడ్ ఆఫ్ కండక్ట్ కింద రషీద్ ఖాన్ పై ఐసీసీ చర్యలు తీసుకుందని సమాచారం. ఏకంగా 55 లక్షల రూపాయలు కట్టాలని రషీద్ ఖాన్ పై ఐసీసీ ఫైన్ వేసిందట. అయితే ఈ విషయం తెలియడంతో రతన్ టాటా… రషీద్ ఖాన్ కు.. ఏకంగా 10 కోట్ల రూపాయలు బహుమానంగా ఇచ్చారట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది వైరల్ చేశారు. అయితే ఈ వార్తలపై స్వయంగా రతన్ టాటా స్పందించి… తాను ఎవరికి పదికోట్ల రూపాయలు ఇవ్వలేదని తేల్చి చెప్పాడు. తనకు క్రికెట్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.