నటి ఇంద్రజ టీవీలో మనకి కనబడుతూనే ఉంటారు తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు ఇంద్రజ తన నటనతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంటారు. తన చిత్రాలతో ఎంతోమంది అభిమానుల్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈమె దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించారు. కేరళలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఈమె పుట్టారు ఇంద్రజ దాదాపు పది సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూర మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.
Advertisement
Advertisement
తమిళ సీరియల్స్ లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలోనే తోటి నటుడు అయిన మహమ్మద్ అబ్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈయన కేరళ కి చెందిన ముస్లిం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇంద్రజ ముస్లిం ని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద విషయమే. ఇంద్రజ వాళ్ల కుటుంబంలోకి వెళ్లడంతో వాళ్లందరూ మాంసాన్ని తినడం కూడా మానేశారట.
ఇంద్రజని పెళ్లి చేసుకున్న క్షణం నుండి ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ని వండరట. ఎంతో గర్వంగా ఈ విషయాన్ని ఇంద్రజ చెప్పారు. అయితే ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే నాన్ వెజ్ ని తినడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అని చెప్పారు. ప్రస్తుతం ఈమె టీవీ షోలలో కనబడుతూ ఉంటారు అలానే జబర్దస్త్ లో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనకి తెలిసిందే.