నటుడు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంచి సంపాదించుకున్నారు. శ్రీహరి విలక్షణ నటుడుగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. శ్రీహరి పలు సినిమాల్లో హీరోలకి హీరోయిన్లకి అన్నయ్య, బాబయ్య మొదలైన పాత్రలు చేసేవారు. కెరియర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన కాలం చేశారు. శ్రీహరి మరణం తర్వాత కుటుంబం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందట. శ్రీహరి నటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు శ్రీహరి కొడుకులు త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారట. శ్రీహరి చనిపోయిన తర్వాత తాము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని డిస్కో శాంతి పలు మార్లు చెప్పారు.
Advertisement
Advertisement
ఇక ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. అసలు శ్రీహరి గారి మరణం ఎలా జరిగింది…? ఆయన మరణానికి సంబంధించిన విషయాలు ఆమె చెప్పారు. పైగా శ్రీహరి చనిపోయిన తర్వాత కూడా డిస్కో శాంతి మెడలో మంగళసూత్రం వేసుకున్నారు అది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళ సూత్రాన్ని అందరికీ ఆమె చూపించారు. ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ మంగళసూత్రం నా మెడలో ఉంది కదా నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనే వార్తలు వస్తున్నాయి.
ఆయన నా మెడలో కట్టిన తాళి తీయకూడదని నేను నిర్ణయించుకున్నాను అందుకే ఎప్పటికీ నా మెడలోనే ఉంటుందని ఆమె చెప్పారు. నా మెడలో ఉంటే బావ నాతో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుందని బావ చనిపోయిన తర్వాత మెడలో మంగళ సూత్రాలు వేసుకోకూడదని చెప్పారు. కానీ నేను తీసేయలేదని ఆమె చెప్పారు మంగళ సూత్రంలో వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా వేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి లాకెట్ గురించి కూడా ఆమె మాట్లాడారు.