కొంతమంది పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. సాధారణంగా చిన్నపిల్లలు ఆకలి వేసినప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం పదే పదే ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా ఏడిస్తే తల్లిదండ్రులు విసిగిపోతారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది అర్థం చేసుకోకుండా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చాలాసార్లు పిల్లలు బిగుతుగా ఉన్న బట్టల్ని వేసుకోవడం వలన ఏడవడం మొదలుపెడతారు.
అసౌకర్యంగా ఉందని భావిస్తారు. పిల్లలకు ఎప్పుడు వదులుగా ఉండే బట్టలు వేయాలి. కాటన్ బట్టలు వేయండి. అప్పుడు గాలి బాగా ఆడుతుంది బాగా టైట్ గా ఉండే బట్టలు వాళ్లకి వేసి ఇబ్బంది పెట్టకూడదు. అలానే బాగా చిన్నప్పుడు తల్లి ఏం తింటే అది నేరుగా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. శిశువుకి పాలు ఇస్తారు. తల్లులు మసాలా, కారం వంటి వాటిని తల్లి తింటే పిల్లల్లో కడుపునొప్పి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు బిడ్డకి తల్లి అతిగా తినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకి కడుపులో ఉబ్బరము, అజీర్తి వంటి ఇబ్బందులు వస్తాయి.
Advertisement
Advertisement
చిన్నపిల్లలు ఎముకలు సున్నితంగా ఉంటాయి చిన్నపాటి అజాగ్రత్త వాళ్ళు ఎముకలని దెబ్బతినేలా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని ఎత్తడం దించడం వంటివి చేయాలి. ఒక శిశువు ప్రతిరోజు సాయంత్రం ఒకే సమయంలో ఏడుస్తుంది ఉంటే కచ్చితంగా అది కడుపునొప్పి అని అర్థం చేసుకోవాలి. చాలామంది తల్లులు పిల్లలు ఏడుస్తుంటే కచ్చితంగా ఆకలి వేస్తోంది అని భావించి పాలు పడుతూ ఉంటారు కానీ వీటిని కూడా చూసుకోవాలి. ఇబ్బందిని కనుక మీరు వెంటనే పరిష్కరించినట్లయితే పిల్లలు ఏడుపుని ఆపేస్తారు మళ్ళీ వాళ్ళ ఆటలో పడతారు.