ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళు సమస్య నుండి బయటపడడానికి ఇలా చేయడం మంచిది. ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది పాలకూర బ్రోకలీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. వీటిని తీసుకోవడం వలన రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకుపచ్చని కూరలు బీన్స్ వంటి వాటిని ఉడికించుకుని తీసుకోండి వీటిని కనుక రోజు తీసుకున్నట్లయితే రక్తం పెరుగుతుంది. అలానే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి ప్రతి రోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.
Advertisement
Advertisement
ఖర్జూరం ఎండుద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి. ఐరన్ విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి. కొన్ని ఖర్జూరం పండ్లను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది నల్ల నువ్వులలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. నారింజన్, నిమ్మ వంటి సిట్రస్ జాతికి సంబంధించిన పండ్లు తీసుకోవడంతో పాటుగా జామపండు, టమాటాలు, ద్రాక్ష పండు, బెర్రీస్ తీసుకుంటే కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆపిల్స్, అరటి పండ్లు, దానిమ్మ, పుచ్చకాయ కూడా తీసుకోండి. బ్లడ్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇతర లాభాలను కూడా వీటివల్ల పొందొచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!