వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో రెండు మ్యాచులో గెలిస్తే సెమీస్ బెర్త్ కాయం చేసుకుంటుంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు బీకర ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ, గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ తర్వాత శ్రేయస్ దంచి కొడుతున్నాడు. విరాట్ కోహ్లీ పసందైన షాట్లతో చెలరేగి ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ అందివచ్చిన ఏ బంతిని కూడా వదలడం లేదు. మరోవైపు బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నారు.
ఆరంభంలో బుమ్రా గట్టి పునాది వేస్తుండడంతో కుల్దీప్ యాదవ్ క్రికెట్లను పడగొట్టే బాధ్యతను తీసుకుంటున్నాడు. పాండ్యా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీ జట్టులోకి అడుగుపెట్టాడు. పైగా హార్దిక్ పాండ్యా మరో మూడు మ్యాచ్లకు దూరంగా ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యను పక్కనపెట్టి అక్షర్ పటేల్ ను తీసుకురావాలన్న ఆలోచనతో రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయగలరు. అక్షర్ ఆల్ రౌండర్ బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తాడు. ప్రస్తుతం టీమిండియాకు ఆల్ రౌండర్స్ అవసరం.
Advertisement
Advertisement
నిజానికి టీమ్ ఇండియా ఇలా అసాధారణ ఆట తీరును ప్రదర్శిస్తుంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో వరల్డ్ కప్ బరిలోకి దిగిన టీమిండియా దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ టైటిల్ రేసులో ముందుంది. ఇక వన్డే వరల్డ్ కప్ ముగిశాక భారతజట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్లు టీ20 సిరీస్ ఆడనుంది. దీనికి హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత టీమిండియా నయా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ పేరు ఏకగ్రీవం కావడం ఖాయం అని అంటున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.