టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఉండరు. తన కెప్టెన్సీలో టీమిండియా కు ఇప్పటికే మూడు ఐసీసీ టోర్నమెంట్లను అందించాడు మహేంద్ర సింగ్ ధోని. 2007 సంవత్సరంలో ఐసిసి టి20 వరల్డ్ కప్ ను టీమిండియా కు అందించాడు ధోని. ఆ తర్వాత 2011 సంవత్సరంలో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ధోని సారాద్యంలోనే కప్ గెలుచుకుంది.
ఆ తర్వాత 2013 సంవత్సరంలో జరిగిన ఐసీసీ టోర్నమెంట్ కూడా ధోని సారథ్యంలోనే టీమ్ ఇండియాకు వచ్చింది. ఇలా టీమ్ ఇండియాకు ఏకంగా మూడు ఐసీసీ టోర్నమెంట్లను తీసుకువచ్చాడు ధోని. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథిగా కొనసాగుతున్న ధోని… సీఎస్కేను కూడా ఐదు సార్లు చాంపియన్గా నిలిపాడు. ఇది ఇలా ఉండగా తాజాగా మహేంద్రసింగ్ ధోని గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో 2019 వరల్డ్ కప్ లో రన్ అవుట్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఏడ్చారంట కదా అని ఈ ఓ అభిమాని ధోనిని ప్రశ్నించారు. అయితే ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేంద్రసింగ్ ధోని రియాక్ట్ అయ్యారు. 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో రన్ అవుట్ అవ్వడంతో…. నేను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో నేను రిటైర్మెంట్ కూడా తీసుకోవాలని అనుకున్న… కానీ దేశం పరువు పోతుందని…దేశం కోసం ఆడాలని అనుకున్న కాబట్టే ఒక సంవత్సరం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని వెల్లడించాడు ధోని. అలాగే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా చాలా బలంగా ఉందని వెల్లడించాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.