Home » పాక్ కెప్టెన్ దారుణంగా ట్రోలింగ్… బాబర్ కాదు…జింబాబర్ అంటూ !

పాక్ కెప్టెన్ దారుణంగా ట్రోలింగ్… బాబర్ కాదు…జింబాబర్ అంటూ !

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా విమర్శలకు టార్గెట్ అయ్యారు. కొందరు పాకిస్తాన్ మాజీలు సైతం బాబర్ ను ఆటాడుకుంటున్నారు. కెప్టెన్సీ దారుణంగా ఉందని ఫైర్ అవుతున్నారు. బ్యాటర్ గాను పాక్ ను ముందుండి నడిపించలేకపోతున్నాడ ని విమర్శిస్తున్నారు. పాక్ కెప్టెన్ బాబర్ ను…జింబాబర్ అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.  నిజానికి వన్డే వరల్డ్ కప్ లో బాబర్ సేన కూడా ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. సెమీస్ రేసులో కచ్చితంగా దూసుకుపోతుందనె అంచనాల మధ్య భారత్ లో అడుగుపెట్టింది. ఉపఖండపు పిచ్ లపై బాబర్ సేన దుమ్ము రేపుతుందనే వాదన కూడా వినిపించింది. అందుకు తగినట్టే టోర్నీ ఆరంభంలో పాకిస్తాన్ విజయాలు సాధించింది.

trolling on pak captain baber

trolling on pak captain baber

శ్రీలంక, నెదర్లాండ్స్ మీద విక్టరీ కొట్టింది. హైదరాబాదులోనే రెండు విజయాలు సాధించింది. అయితే ఆ తర్వాతే అసలు సినిమా మొదలయ్యింది. భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అహ్మదాబాద్ లో టీమిండియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. ఫేవరెట్ అనుకున్న జట్టు కాస్త పసికూనగా మారిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో బాబర్ సేన చిత్తుగా ఓడిపోయింది. వరుసగా రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది. అయితే ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్లో అయినా పాకిస్తాన్ విక్టరీ కొడుతుందని అంతా అనుకున్నారు. పరాజయాలకు ఫుల్ స్టాప్ పెడుతుందని అంచనా వేశారు. కానీ పాకిస్తాన్ జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ కు కూడా పోటీ ఇవ్వలేకపోయింది. 282 పరుగులు చేసిన కాపాడుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ముందు తలవంచింది.

Advertisement

Advertisement

ఆడిన ఐదు మ్యాచుల్లో రెండే విజయాలు సాధించిన పాకిస్తాన్ మూడు మ్యాచుల్లో కంగుతింది. ప్రస్తుతం బాబర్ సేన ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. రన్ రేటు కూడా మైనస్ లో ఉంది. చివరి నాలుగు మ్యాచ్లు గెలిచి ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తేనే పాకిస్తాన్ సెమీస్కు చేరగలదు. లేదంటే ఇంటి దారి పట్టాల్సిందే. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాను బాబర్ సేన ఢీ కొట్టబోతుంది. సూపర్ ఫామ్ లో ఉన్న సఫారీలను ఓడించడం పాకిస్తాన్ కు అంతా ఈజీ కాదు. అన్ని విభాగాల్లోను సౌత్ ఆఫ్రికా సాలిడ్ గా ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్లు గెలిచింది. ఎనిమిది పాయింట్లతో టోర్నీలో ఫేవరెట్ గా మారిపోయింది. ఇలాంటి దశలో కెప్టెన్ బాబర్ రాణించాలని పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఫలితం తేడాగా వస్తే మాత్రం బాబర్ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తర్వాత మ్యాచ్లో విఫలమైతే కెప్టెన్సీ ఓడిపోయే అవకాశం ఉందని కొందరు మాజీలు సైతం అంటున్నారు. కెప్టెన్ గా, ప్లేయర్గా బాబర్ కు వరల్డ్ కప్ లో సవాలు తప్పదని అంటున్నారు. దీంతో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో అందరూ చూపు పాక్ కెప్టెన్ బాబర్ మీదే ఉండబోతోంది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading