వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తడబాటు కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా హాట్ ఫేవరెట్ గా మెగా టోర్నీ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పేలవ ఆట తీరు, ఘోరపరాజయాలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. సెమీస్ రేసులో నిలవాలంటే శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్లో కచ్చితంగా గెలవలి కానీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో చెత్త ఆటతీరుతో ఓటమిని మూట కట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 156 పరుగులకే కుప్పకూలింది. పిచ్ కండిషన్ ను పసిగట్టలేకపోయిన ఇంగ్లాండ్ బ్యాటర్లు స్లో పిచ్ పై ఓపికగా బ్యాటింగ్ చేయకుండా దాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వికెట్లు పడేసుకున్నారు.
Advertisement
బీభత్సమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. లంక పెసర్ల దాటికి పెవీలియన్ కు క్యూ కట్టారు. కేవలం 33 ఓవర్లకే ఇంగ్లాండ్ ప్లేయర్లు చాపచుట్టేశారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 25.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. పాథుమ్ నిస్సంక 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా…. సదిర్ విక్రమ 65పరుగులతో సత్తా చాటాడు. ఇంగ్లాండ్ టీం అంటేనే హార్డ్ హిట్టర్లకు పెట్టింది పేరు. డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. పైగా బ్యాటింగ్ కు అనుకూలమైన చిన్న స్వామి స్టేడియం కావడంతో మంచి స్కోర్ చేస్తారని అంత అనుకున్నారు. కానీ గోరాతి ఘోరమైన ఆట తీరుతో మ్యాచ్ పోగొట్టుకున్నారు.
Advertisement
ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్లడం డౌటే. ఒక రకంగా చెప్పాలంటే సెమీస్ రేసు నుంచి ఇంగ్లాండు అధికారికంగా తప్పుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అది కూడా బంగ్లాదేశ్ పై గెలిచింది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓటమిపాలైంది. ఇక ఇంగ్లాండ్ మరో నాలుగు మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లో వరుసగా గెలిస్తేనే సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలవడం అంత ఈజీ కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ తో, ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది. భారత్ పై పైచేయి సాధించాలంటే శక్తికి మించిన పనే. ఇక మొదటి రెండు మ్యాచ్లు ఓడిన ఆస్ట్రేలియా తర్వాత మూడు మ్యాచుల్లో నెగ్గి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. నెదర్లాండ్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద టీం నే జట్టు చిత్తుగా ఓడించింది. ఇక పాకిస్తాన్ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ నాలుగు సవాళ్లను అధిగమించి ఇంగ్లాండ్ కనక సెమీస్కు వస్తే అది అద్భుతమే అవుతుందంటున్నారు క్రీడా పండితులు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.