వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఓడి నాలుగు పాయింట్లతో ఐదవ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యర్థి జట్లకు షాక్ ఇస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన ఆఫ్గాన్ టీం ఇప్పుడు పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. చెన్నై చెపాక్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను మట్టి కరిపించింది.
నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ అన్ని విభాగాల్లోను సత్తాచాటింది. దీంతో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆఫ్గాన్ 49 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగులు చేజింగ్ లో ఆఫ్గాన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రెహమన్ ఉల్లా, ఇబ్రహీం జార్దాన్ 130 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. కెప్టెన్ హష్మదుల్లా మిగతా పని పూర్తిచేశారు. భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన పాకిస్తాన్ కు ఇది ముచ్చటగా మూడవ ఓటమి. ఈ ఓటమితో పాక్ సెమీస్ లో కూడా కష్టంగా మారాయి.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా…. ఆఫ్ఘనిస్తాన్ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో చెపాక్ మైదానంలో చోటు చేసుకున్న ఓ సన్నివేశం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కామెంట్లు చెప్తున్న టీమిండియా దిగ్గజ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ దగ్గరకు ఆఫ్ఘనిస్తాన్ టీం వెళ్ళింది. ఆఫ్గన్ ఆటతీరుకు ఫిదా అయిన పఠాన్ డాన్స్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దానికి రషీద్ ఖాన్ డాన్స్ తోడవడంతో స్టేడియంలోని కెమెరాలన్నీ ఈ ఇద్దరిపై ఫోకస్ పెట్టాయి. అద్భుతంగా ఆడారంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను పటాన్ సంభాషించాడు. పలువురితో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ గా మారింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.