నెదర్లాండ్స్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ విషయంలో మాత్రం ఐసిసిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే లైటింగ్ షో…. ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచుల మధ్యలో లైటింగ్ షో, లేజర్ షో లను నిర్వహిస్తున్నారు.
వీటివల్ల ప్లేయర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని మ్యాక్స్వెల్ పోస్ట్ ప్రజెంటేషన్ టైమ్ లో చెప్పాడు. గతంలోనే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగుల్లో ఇదే తరహా లేజర్ షోలు పెట్టేవారని…. స్టేడియంలో మొత్తం లైట్లు ఆపేసి నిర్వహించే ఈ లైటింగ్ షో కారణంగా కాసేపు కంటిచూపు సమన్వయం దెబ్బతింటుందని…. ఇది ఆటగాళ్ల ఆటపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చెప్పాడు.
Advertisement
Advertisement
తలనొప్పి రావడం, చుట్టూ ఉన్న చీకటిని చూసి మళ్లీ భారీ లైట్లకు కళ్ళు అడ్జస్ట్ కావడానికి టైం తీసుకుంటుంది అన్నాడు మ్యాక్స్వెల్. తాను వ్యక్తిగతంగా ఆ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నానని…ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ లైట్స్ షో డ్రోన్ షాట్స్ కు తప్ప ఆడియన్స్ కు ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో తనకు అనుమానమే అని అన్నాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.