Home » సుమకి ఎదురైన చేదు అనుభవం.. నిండు మనసుతో క్షమాపణలు చెప్పింది…!

సుమకి ఎదురైన చేదు అనుభవం.. నిండు మనసుతో క్షమాపణలు చెప్పింది…!

by Sravya
Ad

యాంకర్ సుమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సుమ ఎన్నో ఏళ్ల నుండి ఈవెంట్లని హోస్ట్ చేస్తూ ఉంది. పైగా ఎన్నో షోలకి పోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే సుమ కొన్నిసార్లు నోరు జారుతూ ఉంటుంది కొందరు మీద కౌంటర్లు వేస్తుంది. వాటిని కొంతమంది లైట్ తీసుకుంటే కొంతమంది మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. నిన్న అది కేశవ ఈవెంట్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. చివరికి సుమ ఒక వీడియోని రిలీజ్ చేసే నిండు మనసుతో క్షమాపణలు కోరుతున్నారు. మీడియా వాళ్ళు స్నాక్స్ ని కూడా భోజనంలా తింటున్నారు అంటూ సుమ ఒక కౌంటర్ వేశారు.

Advertisement

Advertisement

దీనిపై ఒక మీడియా ప్రతినిధి సుమని వారించాడు. అందరి మీద కౌంటర్లు వేస్తే వేయండి కానీ మీడియా మీద మాత్రం వద్దని సీరియస్ అయ్యాడు. మీరు స్నాక్స్ స్నాక్స్ లానే తిన్నరు. భోజనంలా తినలేదు సారీ అంటూ సుమ మళ్లీ కౌంటర్ వేశారు. ఇవే వద్దు మీడియా మీద కౌంటర్లు వేయకండి అని జర్నలిస్టు గట్టిగా వారించాడు. ఆ తర్వాత ఇష్యూ మీద సుమ స్పందించి ఒక పోస్ట్ పెట్టింది. నెట్టింట సుమకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. సుమ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని మీడియానే అతి చేస్తోందని నెటిజెన్స్ ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. చాలా రోజుల తర్వాత కాంట్రవర్సీ లో సుమ ఇరుక్కోవాల్సి వచ్చింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading